https://oktelugu.com/

Upasana: ఉపాసన పేరు మీద ఉన్న ఆస్తుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

అపోలో హాస్పిటల్ వ్యవహారాలతో పాటు ఇతర బిజినెస్ లను చూసుకుంటూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంటూ సంపాదిస్తోంది. బిజినెస్ మాత్రమే కాదు సేవ కార్యక్రమాల్లో కూడా ముందుంటుంది మెగా కోడలు. మామయ్య చిరంజీవి లాగా సేవ కార్యక్రమాలు చేస్తూ మామకు తగ్గ కోడలు అనిపించుకుంది చెర్రీ భార్య ఉపాసన.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 11, 2024 / 01:34 PM IST

    Upasana

    Follow us on

    Upasana: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక స్టార్ హీరోయిన్ కు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది మెగా కోడలు. ఈమె ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ యాక్టివ్ గా ఉంటుంది. మెగా కోడలిగా, రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాదు.. బిజినెస్ ఉమెన్ గా కూడా కీర్తి ప్రతిష్టలను పొందింది మెగా కోడలు.

    అపోలో హాస్పిటల్ వ్యవహారాలతో పాటు ఇతర బిజినెస్ లను చూసుకుంటూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంటూ సంపాదిస్తోంది. బిజినెస్ మాత్రమే కాదు సేవ కార్యక్రమాల్లో కూడా ముందుంటుంది మెగా కోడలు. మామయ్య చిరంజీవి లాగా సేవ కార్యక్రమాలు చేస్తూ మామకు తగ్గ కోడలు అనిపించుకుంది చెర్రీ భార్య ఉపాసన. అయితే చాలా సందర్భాల్లో ఉపాసన ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన మరో వార్త ట్రెండ్ అవుతుంది..

    ఉపాసన తన ఫ్యామిలీకి సంబంధించిన ఎలాంటి అకేషన్ అయినా అన్ని పనులు దగ్గర ఉండి మరీ చూసుకుంటుంది. తాజాగా తన అత్త పేరు మీద అత్తమ్మ కిచెన్ అంటూ ఓ బిజినెస్ ను ప్రారంభించింది. ఇలా అన్ని పనుల్లో బిజీగా ఉంటూ మెగా ఫ్యామిలీలో మంచి కోడలిగా కూడా పేరు సంపాదించింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా వీరికి కూతురు పుట్టిన విషయం తెలిసిందే. పాపతోనే బిజీగా ఉంటున్న ఉపాసన ప్రస్తుతం బిజినెస్ లు చూసుకోవడం కష్టమే. వీటి గురించి అప్డేట్ లేదు కానీ.. ఈమె పేరు మీద ఉన్న ఆస్తులకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది.

    ఈమె ఆస్తుల వివరాలను ఓ నివేదిక తెలియజేసింది. ఉపాసనకు భారీ స్థాయిలో ఆస్తులు ఉన్నాయని టాక్. కేవలం ఉపాసన పేరు మీదనే రూ. 1,130 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈమె పేరు మీదనే ఇన్ని ఆస్తులు ఉంటే చిరు ఫ్యామిలీకి ఎంత ఆస్తులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఉపాసన సంపాదన కూడా అర్థం చేసుకోవచ్చు అంటూ కామెంట్లు వస్తున్నాయి. కానీ ఈ మెగా కోడలు మాత్రం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది.