https://oktelugu.com/

Varun Tej Experiment: పొట్టపెంచబోతున్న మెగా హీరో… ఇది మామూలు రిస్క్ కాదు!

ఇప్పటి వరకు చేసిన ప్రయోగాలు ఒకెత్తు, ఇప్పుడు చేయబోయే ప్రయోగం మరో ఎత్తని టాక్ వినిపిస్తుంది. వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నారు.

Written By: , Updated On : March 11, 2024 / 02:06 PM IST
Varun Tej experiment with Matka

Varun Tej experiment with Matka

Follow us on

Varun Tej Experiment: పాత్ర కోసం శరీరాన్ని మార్చుకునే కొద్ది మంది హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు. పలు చిత్రాల్లో ఆయన ఈ ప్రయోగం చేశాడు. ముఖ్యంగా గని చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు. గని మూవీలో వరుణ్ తేజ్ బాక్సర్ రోల్ చేశాడు. తన ఫైట్ సహజంగా ఉండాలని బాక్సింగ్ నేర్చుకున్నాడు. అలాగే విపరీతంగా వ్యాయామం చేశాడు. గని చిత్ర ఫలితం అటుంచితే… వరుణ్ తేజ్ కష్టాన్ని ప్రేక్షకులు మెచ్చుకున్నారు. ఆయన రీసెంట్ మూవీ ఆపరేషన్ వేలెంటైన్ కోసం కూడా వరుణ్ తేజ్ మేకోవర్ అయ్యాడు.

అయితే ఇప్పటి వరకు చేసిన ప్రయోగాలు ఒకెత్తు, ఇప్పుడు చేయబోయే ప్రయోగం మరో ఎత్తని టాక్ వినిపిస్తుంది. వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా(Matka) టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నారు. మట్కా చిత్రీకరణ జరుపుకుంటుంది. కరుణ కుమార్ దర్శకుడు. కాగా మట్కా చిత్రంలో వరుణ్ తేజ్ మూడు భిన్నమైన ఏజ్ గ్రూప్లో కనిపిస్తాడట. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ల వ్యక్తిగా మూడు పాత్రల్లో ఆయన అలరించనున్నాడట. ఈ మూడు పాత్రల్లో మూడు రకాలుగా ఆయన గెటప్ ఉంటుందట.

ముఖ్యంగా 50 ఏళ్ల వయసు పాత్రలో వరుణ్ తేజ్ పొట్టతో కనిపించనున్నాడట. కాబట్టి ఈ పాత్ర కోసం వరుణ్ తేజ్ పొట్ట పెంచనున్నాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ… ప్రధానంగా వినిపిస్తుంది. మట్కా చిత్రానికి కరుణ కుమార్ దర్శకుడు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.

ఇక వరుణ్ లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. పుల్వామా దాడి అనంతరం పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడి సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. వరుణ్ తేజ్ కమాండర్ రోల్ చేశారు. వరుణ్ కి జంటగా మానుషీ చిల్లర్ నటించింది. ఈ మూవీ ఆశించినంతగా ఫలితం ఇవ్వలేదు. కాగా గత ఏడాది వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం ఇటలీ దేశంలో ఘనంగా జరిగింది.