Pulasa Fish: మనకు మాంసాహారాల్లో చేపలకు భలే డిమాండ్ ఉంటుంది. చేపల్లో ఉండే ప్రొటీన్ల గురించి తెలిసిందే. అందుకే వాటిని తినాలని అందరు ఆరాటపడుతుంటారు. ఒక ఏడాదికి కనీసం కిలో ముల్లు మన కడుపులో పడితే మంచి ఆరోగ్యమంటారు. అలా చేపలు తినడం వల్ల మనకు ఆరోగ్యం మెరుగు పడుతుంది. చేపల్లో పులస రుచి వేరుగా ఉంటుంది. ఇవి ఉభయ గోదావరి జిల్లాల్లోనే దొరుకుతాయి.
కిలో రూ. 6 వేలు
వీటి రేటు చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. కిలో రూ.6 వేల వరకు పలుకుతుంది. వీటిని కిలోల లెక్కన అమ్మరు. వేలం ద్వారా మాత్రమే విక్రయిస్తారు. అందుకే వీటికి డిమాండ్ భారీగా ఉంటుంది. ఇవి జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మాత్రమే దొరకుతాయి. అక్టోబర్ లోగా సముద్రంలోకి వెళ్లిపోతాయి. ఆస్ట్రేలియాలో పుట్టి హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం మీదుగా బంగాళాఖాతంలో చేరి అక్కడి నుంచి గోదావరిలో వస్తాయి.
పులస పండగ
ఈ మూడు నెలల్లో పులస పండుగ నిర్వహిస్తారు. ఈ సమయంలోనే ఇవి దొరకడం వల్ల వీటిని తినేందుకు జనం కూడా మొగ్గు చూపుతారు. పులసల్లో రుచి బాగుంటుంది. అందుకే వీటిని తిని తమ జిహ్వ చాపల్యాన్ని అనుభవిస్తారు. చేపల్లో ఉండే ప్రొటీన్ల వల్ల వీటిని చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇలా పులసలను తిని తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు.
ముళ్లు ఎక్కువగా..
సముద్రం గుండా వచ్చే సమయంలో అంతర్వేదిలో గోదావరిలో కలుస్తాయి. ఏటికి ఎదురీది బతికే చేపల్లో ఇవి ముఖ్యమైనవి. ఎందుకంటే వీటికి ముళ్లు ఎక్కువగా ఉండటం వల్ల ఎదురుగా వెళ్లినా చనిపోకుండా ఉంటాయి. గోదావరిలో కలిసే సమయంలో జాలర్లకు దొరుకుతాయి. వీటి డిమాండ్ వల్ల డబ్బు ఉన్న వారే తింటారు. పేదవారికి అంత డబ్బు పెట్టి కొనుక్కునే స్తోమత ఉండదు.
గుర్తించడమెలా?
వీటిని గుర్తించడమెలా అంటే బంగారు రంగులో ఉంటాయి. మూతి దగ్గర పసుపు కలర్ లో ఉంటుంది. వీటిని కొనేటప్పుడు తెలిసిన వారిని మాత్రమే తీసుకుపోవాలి. మనకు తెలియకుండా కొంటే మోసపోయే ప్రమాదముంటుంది. దీంతో నకిలీవి కొని మోసాలకు గురికావద్దు.