Anchor Jayathi: సినిమాల్లో హీరోయిన్ ఎంత ఇంపార్టెంటో.. టీవీల్లో యాంకర్ కు కూడా అంతే గుర్తింపు ఉంటుంది. ఒక విషయాన్ని కెమెరా ముందు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చెప్పడం అందరికీ సాధ్యం కాదు. అందుకోసం అందంగా ఉండడంతో పాటు ఆకర్షణీయమైన వ్యాక్చాతుర్యం ఉండాలి. ఇలాంటి గుణాలు ఉన్న చాలా మంది యాంకర్ గా రాణించారు. ఆ తరువాత సినిమాల్లో అవకాశాలు తెచ్చుకున్నారు. ఒకప్పుడు టీవీల్లో కొన్ని మాత్రమే స్పెషల్ ప్రొగ్రామ్స్ ఉండేవి. వీటీల్లో యాంకరింగ్ చేసిన వారికి ప్రత్యేక గుర్తింపు ఉండేది. దశాబ్దకాలం కిందట మృదుల, ఝాన్సీ, సుమ తదితరులు తమ యాంకరింగ్ తో ఆకట్టుకునేవారు. వీరికి పోటీనిస్తూ కుర్రాళ్లను ఆకట్టుకునే విధంగా తన మాటలతో మెప్పించిన బ్యూటీ జయది.
జెమిటీ మ్యూజిక్ చానెల్ లో ‘వెన్నెల’ అనే ప్రోగ్రాం ద్వారా జయతి యాంకర్ గా కనిపించింది. ఇందులో ఆమె తన ముద్దు ముద్దు మాటలతో యూత్ ను బాగా ఆకట్టకున్నారు. దీంతో సాయంత్రం అయిందంటే చాలు వెన్నెల ప్రొగ్రాంను ప్రత్యేకంగా చూసేవారు తయారయ్యారు. ఈప్రొగ్రామ్ లో సాంగ్ కు ముందు జయతి చెప్పే చేసే వ్యాఖ్యలు ఆకట్టుకునేవి. ఇందులో ఫేమస్ అయిన తరువాత జయతి మళ్లీ కనిపించలేదు. అయితే చాలా రోజుల తరువాత ఆమె కెమెరా ముందుకు వచ్చారు.
ఈటీవీలో వచ్చే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ అనే షో ద్వారా అలనాటి యాంకర్లను పరిచయం చేయశారు. సీనియర్ యాంకర్లు, జూనియర్ యాంకర్లు అనే ప్రోగ్రాంలో జయతి పాల్గొన్నారు. ఇందులో ఆమెను చూసి అప్పటి ప్రేక్షకులు షాక్ అయ్యారు. అప్పటికీ ఇప్పటికీ జయతి అలాగే అందంగా ఉండడం విశేషం. ఏమాత్రం తేడా రాకుండా తన బ్యూటీ నెస్ ను జయతి మెయింటేన్ చేస్తూ వస్తున్నారు. ఇక ఇందులో జయతితో పాటు మరికొందరు యాంకర్లు తమ పర్ఫామెన్స్ చూపించారు.
ఇప్పుడున్న యాంకర్లలో అప్పటి వారిలో సుమ మాత్రమే కొనసాగుతున్నారు. కొత్తవారు రష్మి, అనసూయ, రవి, ప్రదీప్ లు తమ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే అప్పటి యాంకర్ జయతి చాలా రోజుల తరువాత కెమెరా ముందుకు రావడంతో ఆమె మళ్లీ టీవీల్లోకి వస్తుందా? అని అంతా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం యాంకర్లకు మంచి డిమాండ్ ఉంది. టీవీ ప్రోగ్రామ్స్ కూడా విపరీతంగా పెరగడంతో ఆమెతో ప్రత్యేక ప్రోగ్రాం చేయించాలని కొందరు నెటిజన్లు కోరుతున్నారు.