Brahmins: మన హిందూ సమాజంలో బ్రాహ్మణులు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. నాలుకకు ఎంత రుచి అనిపించినా ఇతర పదార్థాలను వారు ముట్టుకోరు. మడి కట్టుకుని వంట చేస్తారు. ఆచార సంప్రదాయాలుపాటించడంలో ఘనాపాటిగా చెబుతారు. అందుకే వారి జీవన విధానం ఓ ఆచార వ్యవహారాలకు నిలయంగా ఉంటోంది. బ్రాహ్మణ కుటుంబాలు వేదాలు పారాయణం చేస్తుంటాయి. మంత్రాలు ఉచ్ఛరిస్తుంటాయి. పొద్దున లేచింది మొదలు పడుకునే వరకు వారి సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి.

సంధ్యావందనం చేయనిదే చాయ కూడా తాగరు. సూర్యుడికి అర్జమివ్వనిదే అల్పాహారమైనా ముట్టరు.అయితే వీరి ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లిని సైతం తీసుకోరు. ఎందుకంటే వాటి నుంచి వచ్చే వాసనతో ఇతరులకు ఇబ్బందిగా ఉంటుందని భావిస్తారు. అందుకే వారి ఆహార నియమాలు కచ్చితంగా పాటిస్తారు. ఏ పూట వంట ఆ పూటే చేసుకుంటారు. అందులో తాజా కూరయాలు ఉండేలా చూసుకుంటారు. రజో గుణాలను కలిగించే ఆహార పదార్థాల జోలికి వారు వెళ్లరు.

Also Read: Superstar Krishna: తెలుగు మొదటి పాన్ ఇండియా స్టార్ ఆయనే !
ఉల్లిపాయ, వెల్లుల్లిలో సల్ఫర్ (గంధకం) ఉంటుంది. అందుకే దాని నుంచి ఎక్కువ వాసన వస్తుందని తెలుస్తోంది. అందుకే దాన్ని భోజనంలో లేకుండా చూసుకుంటారు. బ్రాహ్మణులు నియమాలను నిష్టగా పాటిస్తారు. ఉల్లిపాయ, వెల్లుల్లిని సాత్విక ఆహారం కింద పరిగణించరు. అందుకే వాటిని ముట్టుకోవడానికి ఇష్టపడరని చెబుతున్నారు. నిజానికి ఉల్లిపాయ, వెల్లుల్లితో శరీరానికి చాలా మేలు జరుగుతుందని తెలిసినా వారు మాత్రం తీసుకోవడానికి వెనుకాడతారు.

బ్రాహ్మణులు మంత్రోచ్ఛారణను వృత్తిగా ఎంచుకోవడంతో స్పష్టమైన ఉచ్ఛారణ అవసరం. వీటిని తీసుకుంటే నోటి నుంచి ఓ రకమైన వాసనతో పాటు మంత్రాలు పలకడం సరిగా రాదట. అందుకే వారు వీటిని దూరంగా పెడతారని చెబుతున్నారు.మొత్తానికి ఉల్లి, వెల్లుల్లి మన భోజనంలో భాగం అయితేనే ఆ పదార్థాలకు రుచి వస్తుంది. కానీ బ్రాహ్మణులు మాత్రం వాటిని ముట్టుకోకుండా ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం.
Also Read:Vishwak Sen: పెద్దలు, స్టార్లు విశ్వక్ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ?