GHMC: హైదరాబాద్ నగరపాలక సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ ప్రజలను చైతన్యం చేస్తోంది. శుభ్రత పాటించకపోతే ఇక జరిమానాలు విధించేందుకు సిద్ధమవుతోంది. నగరంలోని ప్రతి అపార్టుమెంట్, ఇల్లు, ఇతర ఆవాసాలను కేంద్రంగా చేసుకుని పరిశీలన చేయాలని భావిస్తోంది. ఇందుకు గాను ఎంటమాలజీ సిబ్బందిని వినియోగించుకుని నగరమంతా సర్వే చేయాలని సంకల్పించింది. ఎక్కడ చెత్త కనిపించినా స్థానికులకు ఫైన్ లు విధిస్తోంది. ఇప్పటికే రాజేంద్రనగర్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో సర్వే నిర్వహించి కొందరికి జరిమానాలు విధించడం చర్చనీయాంశం అవుతోంది.

నగరం మొత్తం పరిశుభ్రంగా ఉంచాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ప్రతి వాడలో మురుగు నీరు నిలవ ఉండకుండా చూస్తోంది. అపరిశుభ్రత వల్ల దోమలు వ్యాప్తి చెంది తద్వారా మలేరియా, ఫైలేరియా, డెంగూ తదితర వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. అందుకే నగరపాలక సంస్థ తన సిబ్బందితో కలిసి అన్ని ప్రాంతాలు పర్యటించి సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు పర్యటిస్తోంది. గ్రేటర్ అధికారులతో కమిషనర్ సమావేశం నిర్వహించి పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వివరించారు.
Also Read: MLA Raja Singh Arrested: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ అరెస్టు.. వదలని తెలంగాణ సర్కార్
కాలనీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఉన్న 2300 సిబ్బంది సరిపోరని 7500 మందిని నియమించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ కార్మికులు పనిభారంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు వైరల్ రోగాల బారిన పడకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. దీంతోనే ప్రజలకు జరిమానా విధించి వారిలో భయం కలిగిస్తున్నారు. దీనిపై ప్రజలు కూడా అధికారులను ప్రశ్నిస్తున్నారు. కాలనీల్లో చెత్త తొలగించకుండా తమపై జరిమానాలు విధించడం ఏంటని అడుగుతున్నారు.

విషజ్వరాలను కట్టడి చేసే క్రమంలో ప్రజలపై భారం మోపడం ఏమిటని ఎదురుదాడి చేస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది కావాలనే ప్రజలపై చర్యలకు దిగుతున్నారు. పరిసరాల పరిశుభ్రతపై అధికారులకు పట్టింపు ఉండాలి కానీ ప్రజలు ఎలా బాధ్యులవుతారని ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది చర్యలను ఆక్షేపిస్తున్నారు. కావాలనే ప్రజలను టార్గెట్ చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నా సిబ్బంది మాత్రం తమ పని తాము కానిస్తున్నారు.
Also Read: Liger: ‘లైగర్’ విజయ్ దేవరకొండ మన కరీంనగర్ కుర్రాడేనంట