Puri Jagannadh- Charmi: పూరి కనెక్ట్స్ నిర్మాణ భాగస్వాములుగా కొనసాగుతున్న పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ మధ్య ఉన్న రిలేషన్ ఏమిటనేది కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే, నేడు రిలీజ్ అయిన లైగర్ బాగా నిరాశ పరిచింది. ఈ సినిమా కోసం పూరి – ఛార్మి చాలా కష్ట పడ్డారు. ఇద్దరు కలిసి కట్టుగా వర్క్ చేశారు. కానీ సినిమా బాగా నష్టాలు తెచ్చేలా ఉంది. మరి ఇప్పుడు కూడా వీరి మధ్య ఉన్న రిలేషన్ ఇలాగే ఉంటుందా ?, ఇదే ప్రస్తుత మిలియన్ డాలర్ ప్రశ్న.

కలిసి సినిమాలు నిర్మిస్తూ, ఒకే ఇంటిలో నివసిస్తున్న వీరు సహజీవనం చేస్తున్నారనే వాదన చాలా కాలంగా వినిపిస్తోంది. దాదాపు పదేళ్లుగా పూరి, ఛార్మి అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. పూరి ఎక్కడ ఉంటే ఛార్మి అక్కడ ఉంటుంది. కలిసి మందు కొడతారు. పార్టీలలో పాల్గొంటారు. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విడుదల చేస్తారు. అందుకే, వీరి రిలేషన్ బహిరంగ రహస్యమే. కానీ ఏ బంధంలో అయినా లాభం ఉంటేనే ఆ బంధం నిలబడుతుంది.
కానీ నష్టాల మయంలో మునిగే ఛాన్స్ ఉన్న లైగర్ దెబ్బకు ఇప్పుడు వీరి అనుబంధం పరిస్థితి ఏమిటి అనేది డౌట్ గా మారింది. నిజానికి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘బుడ్డా హోగా తేరా బాప్’, ‘జ్యోతిలక్ష్మి’ చిత్రాల్లో ఛార్మి నటించింది. ఈ సినిమాల సమయంలోనే ఆమె పూరి కి దగ్గర అయ్యింది. ఈ క్రమంలోనే కలిసి సినిమా వ్యాపారం మొదలు పెట్టారు.

ఛార్మి, నిర్మాతగా పూరితో కలిసి ఏడు చిత్రాలు చేసింది. పైగా జనగణమన చిత్రీకరణ దశలో ఉంది. ఛార్మి మాయలో పడి దర్శకుడు పూరి తన భార్య లావణ్యను, పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నారనే వాదన కూడా ఉంది. చోర్ బజార్ ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత బండ్ల గణేష్ పరోక్షంగా ఇదే చెప్పారు. జీవితంలోకి వ్యాంప్ లు, ర్యాంప్ లు వస్తూ పోతూ ఉంటాయి. భార్యా పిల్లలే శాశ్వతమని బండ్ల గణేష్.. పూరి ఇన్ డైరెక్ట్ గా క్లాస్ పీకాడు. మరి ఇప్పుడు పూరి ఏం చేస్తాడు ?, పూరి కూడా ఇదే ఫీల్ అవుతాడా ?, లేక ప్రేమ గొప్పది అంటాడా చూడాలి.
ఇప్పటికే, తనకు భర్తను దూరం చేస్తుందనే అక్కసుతో ఛార్మిని లావణ్య కొట్టారని కూడా టాక్ ఉంది. మొత్తానికి ఇంత రామాయణం జరుగుతుండగా ఎట్టకేలకు లైగర్ రిలీజ్ అయ్యింది. ప్లాప్ అయ్యింది. ఫైనల్ గా పూరి – ఛార్మి బంధానికి ఎండింగ్ కార్డు ఇచ్చేలా ఉంది. ఛార్మి పూరిని ఇక వదిలేయడం ఖాయం అని ఇండస్ట్రీ లో ప్రచారం జరుగుతుంది.
Also Read:Brahmaji- Charmi Kaur: ఛార్మిపై బ్రహ్మాజీ ఫైర్ – వైరల్ గా మారిన బ్రహ్మాజీ ట్వీట్