Happiness: ఆనందం అంటే ఏమిటి? దానికోసం ఏం చేయాలి?

ఆనందం అంటే కేవలం ఒకటే నిర్వచనం.. అదేనండి నవ్వు. ఆ నవ్వుతో పాటు కాసేపు సుఖంగా రిలాక్స్ గా ఉంటే దానికి మించిన సంతోషం ఏం కావాలి చెప్పండి. ప్రతి రోజు కాసేపు నవ్వుకుంటూ ఉంటే ఆనందం దానంతట అదే వస్తుంది.

Written By: Swathi, Updated On : March 21, 2024 5:11 pm

Happiness

Follow us on

Happiness: ఆనందం, సంతోషం ఏ మనిషి అయినా ఎవరు అయినా కష్టపడేది దీనికోసమే. ఎన్ని యుద్ధాలు చేసినా ఎన్ని మోసాలు చేసినా అంతిమ లక్ష్యం మాత్రమే సంతోషం. కానీ కొందరు దీని కోసం తప్పుడు మార్గాలను ఎంచుకొని కష్టాల పాలు, ధు:ఖం పాలు అవుతుంటారు. కానీ తినడానికి తిండి కూడా సరిగ్గా లేని కొందరు సంతోషంగా ఉంటారు. అసలు సంతోషానికి నిర్వచనం కూడా కొందరికి తెలియదు అంటే నమ్ముతారా?

సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణికి కూడా ఎమోషన్ ఉంటుంది. మనిషికి మాత్రమే కాదు పశుపక్ష్యాదులకు కూడా ఈ ఎమోషన్ ఉంటుంది. ఇక ఈ ఎమోషన్స్ అన్నింటిలో బెస్ట్ ది మాత్రం ఆనందం. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఎలాంటి కష్టం లేకుండా ఉండాలి అనుకుంటారు. కానీ జీవిత గమ్యంలో… బతుకు సాగే బండి చక్రంలో ఒడిదుడుకులు, కష్టాల కడలి వల్ల ఆనందాన్ని కోల్పోయేవారు ఎందరో ఉన్నారు. అయితే ఆనందాన్ని దూరం చేసుకోవద్దు అంటే కొన్ని టిప్స్ పాటించాలి.

ఆనందం అంటే కేవలం ఒకటే నిర్వచనం.. అదేనండి నవ్వు. ఆ నవ్వుతో పాటు కాసేపు సుఖంగా రిలాక్స్ గా ఉంటే దానికి మించిన సంతోషం ఏం కావాలి చెప్పండి. ప్రతి రోజు కాసేపు నవ్వుకుంటూ ఉంటే ఆనందం దానంతట అదే వస్తుంది. ఆనందం అన్నింటిలో ఉంటుంది. కానీ మనం చూసే కోణం మారాలి అంటున్నారు సైకాలజిస్ట్ లు. ఈ ఆనందాన్ని ఎక్కడో కాదు మనమే వెతుక్కోవాలి. అది కూడా అందని వాటిలో కాదు ఉన్నదాంట్లోనే ఆనందాన్ని వెతుక్కోవాలి అంటున్నారు సైకాలజిస్ట్ లు.

మీ జీవితంలో ప్రతి రోజు మీ ప్రెండ్స్, కుటుంబ సభ్యులు, కొలీగ్స్, స్నేహితులు ఇలా ఎందరో మీకు తెలిసిన వారు ఉంటారు. అలాంటప్పుడు వారితో ఆనందాన్ని గడిపేయండి. డబ్బులో, షాపింగ్స్ లో లేని ఆనందం కొంచెం నవ్వులో ఉందని గమనించండి. సంతోషంగా ఉండండి.