Rekha: నటి రేఖ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు బాలీవుడ్ ను శాసించిన ఈ నటి కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఫుల్ బిజీగా ఉంది. అయితే అమితాబ్ బచ్చన్ కు రేఖకు ఉన్న రిలేషన్ గురించి ఇప్పటికీ ఎన్ని పుకార్లు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ నటి మాత్రం పెళ్లి కాకుండానే ఓ హీరో పేరుతో సింధూరం పెట్టుకుంటుందని టాక్ వస్తుంది..
అమితాబ్ బచ్చన్ తో మాత్రమే కాదు రేఖకు ఇతర హీరోలతో కూడా రిలేషన్ ఉందనే టాక్ ఉండేది. రేఖ జీవితం సినిమా లైఫ్ కంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందనే టాక్ ఉంది. ఇదిలా ఉంటే అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈమె నటించిన సినిమాలు కూడా సూపర్ హిట్ అవడంతో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది రేఖ. ఇదిలా ఉంటే అమితాబ్ బచ్చన్ కు రేఖకు రిలేషన్ ఉందనే టాక్ ప్రతి ఒక్కరికి తెలిసిందే.
ఈ ప్రముఖ హీరోతో రిలేషన్ ఉందనే టాక్ మాత్రమే కాదు.. రహస్యంగా ఆయనను పెళ్లి చేసుకుందనే టాక్ కూడా ఉంది. వీరిద్దరు కలిసి ఓ సినిమాలో నటించారు. ఆ తర్వాతనే అమితాబ్ పేరు మీద రేఖ నుదుటన సింధూరం ధరిస్తుందనే టాక్ వచ్చింది. ఓ హీరోతో రేఖకు పెళ్లైందని.. పెళ్లి తర్వాతనే ఇలా సింధూరం పెట్టుకుంటుందని.. ఆ హీరో ఎవరో కాదు అమితాబ్ బచ్చన్ అంటూ టాక్ ఉంది.
1984 లో రేఖ సంజయ్ దత్ తో కలిసి జమీన్ ఆకాష్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే ఇద్దరు సన్నిహితంగా మెలిగారట. కానీ వీరిద్దరి రిలేషన్ మాత్రం సంజయ్ తల్లికి నచ్చలేదట. అయితే వీరికి రిలేషన్ ఉందనే టాక్ వచ్చిన దగ్గర నుంచే రేఖ అమితాబ్ పేరు మీద సింధూరం ధరిస్తుందనే టాక్ వచ్చింది.