https://oktelugu.com/

Siddu Jonnalagadda: నీది ఏం సంస్కారం సిద్దూ అన్నా… అనుపమ విషయంలో హీరో చేసిన పనికి ఫ్యాన్స్ షాక్!

హోమ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ బోల్డ్ రోల్ చేసింది. ఆమె ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. ట్రైలర్ చూసిన జనాల మైండ్ బ్లాక్ అయ్యింది. ఇదే విషయం అనుపమను మీడియా ప్రతినిధులు అడగడం జరిగింది.

Written By:
  • S Reddy
  • , Updated On : March 21, 2024 / 05:16 PM IST

    Siddu Jonnalagadda

    Follow us on

    Siddu Jonnalagadda: హీరో సిద్దూ జొన్నలగడ్డ డీజే టిల్లు మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. 2022లో విడుదలైన ఈ మూవీ నిర్మాతలకు భారీగా లాభాలు పంచింది. ఈ క్రమంలో దానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ చిత్రాన్ని తెరకెక్కించారు. టిల్లు స్క్వేర్ మూవీ మార్చి 29న విడుదల కానుంది. మాలిక్ రామ్ ఈ చిత్ర దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ నిర్మించాయి. టిల్లు స్క్వేర్ చిత్రాన్ని గట్టిగా ప్రోమోట్ చేస్తున్నారు. హీరో సిద్దూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ మీడియా ముందుకు వచ్చారు. ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.

    ఇక హోమ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ బోల్డ్ రోల్ చేసింది. ఆమె ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. ట్రైలర్ చూసిన జనాల మైండ్ బ్లాక్ అయ్యింది. ఇదే విషయం అనుపమను మీడియా ప్రతినిధులు అడగడం జరిగింది. హోమ్లీ ఇమేజ్ ఉన్న మీరు శృంగార సన్నివేశాల్లో నటించడానికి కారణం ఏమిటి? అనగా… మీరే ఒకే తరహా పాత్రలు చేస్తుంది అంటారు. మళ్ళీ మీరే బోల్డ్ రోల్స్ చేస్తుంది అంటారు. ఎప్పుడూ ఒకే విధమైన పాత్రలు చేస్తే బోర్ కొట్టేస్తుంది.

    అందుకే కొంచెం కొత్తగా ట్రై చేశాను. టిల్లు స్క్వేర్ లో లిల్లీ పాత్ర రిజెక్ట్ చేస్తే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. దర్శకుడు చెప్పిన మేర పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేశానని అనుపమ పరమేశ్వరన్ అన్నారు. అయితే ప్రెస్ మీట్ లో సిద్దూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ తో ప్రవర్తించిన తీరు ప్రశంసలు అందుకుంటుంది. మూవీలో లిప్ కిస్ లు లాగించేసిన సిద్దూ… అనుపమను టచ్ చేయకుండా ఫోటోలకు పోజిచ్చాడు.

    సదరు ఫోటోలు చూసిన నెటిజెన్స్ సిద్ధూ మిస్టర్ పర్ఫెక్ట్ అంటున్నారు. ఆయన సంస్కారానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. కెమెరా ముందు కెమిస్ట్రీ తప్పదు. ఆఫ్ స్క్రీన్ లో చేయాల్సిన అవసరం లేదని సిద్దూ నిరూపించాడు. సిద్దూ-అనుపమ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక టిల్లు స్క్వేర్ మూవీపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ దక్కడం ఖాయం. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్మురేపుతోంది.