Two Crowns Head: మనం కొన్నింటిని నమ్ముతుంటాం. మన ఆచార వ్యవహారాల్లో చాలా వాటిని మనం విశ్వసిస్తుంటాం. మన నెత్తి మీద రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయని చాలా మంది చెబుతుంటారు. కానీ ఇందులో నిజం లేదు. ఇది కేవలం అపోహ మాత్రమే. పూర్వ కాలం నుంచే మన తలలో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయనే నానుడి ఉంది. ఇది నిజంగా జరుగుతుందని చాలా మంది భయపడుతుంటారు. కానీ ఇందులో వాస్తవం లేదనే విషయం చాలా మందికి తెలియదు.
రెండు సుడులు ఎందుకుంటాయి?
ఇది జన్యుపరమైన లోపం మాత్రమే. దీనికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. రెండు సుడులు నెత్తిలో ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయని చాలా మంది భ్రమిస్తుంటారు. కానీ దీనికి భయపడాల్సిన అవసరం లేదు. తలపై రెండు సుడులు ఉండటం వల్ల ఇబ్బందులు కూడా ఉండవు. కానీ కొందరి మాటల వల్ల రెండు సుడులు ఉన్న వారు తమకు రెండు పెళ్లిళ్లు అయితే ఎలా అనే భయంతోనే ఉంటున్నారు.
ఎంత మందికి ఉంటాయి?
ప్రపంచంలో ఐదు శాతం మందికి మాత్రమే తలలో రెండు సుడులు ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లలో చాలా తక్కువ మందికి మాత్రమే రెండు పెళ్లిళ్లు అయ్యాయట. తలలో రెండు సుడులు ఉన్న వారికి కారణాలు జీన్స్ వల్లే వస్తాయని చెబుతుంటారు. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా రెండు సుడులు ఉంటే వారసత్వంగా వచ్చినవే తప్ప ఇతర కారణాలు లేవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు సుడుల వల్ల ఎలాంటి నష్టాలు లేవని తెలుసుకోవాలి.
భయాలు వద్దు
తలలో రెండు సుడులు ఉన్నంత మాత్రాన ఏదో జరుగుతుందనే అపోహ వద్దు. దీంతో అందరికి రెండు పెళ్లిళ్లు కావు. కొందరికి మాత్రమే అలా జరుగుతుందట. దీని వల్ల ఎలాంటి పట్టింపులు వద్దు. సాధారణంగా ఉండొచ్చు. భయంతో ఏవో తెలియని పనులు చేయకూడదు. ఇలా రెండు సుడులు ఉన్న వారు కంగారు పడాల్సిన పనిలేదని గుర్తుంచుకోవాలి.