Chanakya Neeti : అందమైన జీవితం కావాలంటే కొన్ని విషయాలపై పూర్తిగా అవగాహన ఉండాలి. మన గురించి ఆలోచించే ముందే ఎదుటి వ్యక్తి గురించి తెలుసుకోవాలని కొందరు చెబుతారు. పక్కన ఉన్నవారు.. స్నేహితులు, కుటుంబ సభ్యులు.. ఇలా ఎవరైనా సంబంధాలు కలిగి ఉన్న వారిలో కొందరు మంచివాళ్లు.. మరికొందరు మోసం చేసేవాళ్లు ఉంటారు. వీరి గురించి ముందే తెలుసుకోవడం వల్ల అలాంటి వారి నుంచి నష్టం రాకుండా ఉంటుంది. సమాజంలో బుద్ధిమంతులు, మూర్ఖులు ఉంటారు. బుద్ధిమంతుల వల్ల ఎలాంటి నష్టం ఉండకపోవచ్చు. కానీ వారితో స్నేహం చేయడం సాధ్యమైన పనికాదు. ముర్ఖుల వల్ల నష్టమే జరగవచ్చు. కానీ కావాల్సిన వారు అయితే వారిని దూరం చేసుకోకుండా ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. అయితే మూర్ఖులు, బుద్ధిమంతులను ఆకట్టుకోవాలంటే చాణక్య నీతి ప్రకారం కొన్ని సూత్రాలు పాటించాలి. అవేంటంటే?
రాజనీతి బోధకుడు చాణక్యుడు రాజ్యానికి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా వ్యక్తి జీవితానికి సంబంధించిన విలువైన సూత్రాల గురించి చెప్పాడు. వీటిని పాటించడం వల్ల తమ జీవితం సార్థకమైందని కొందరు చెబుతూ ఉంటారు. సమాజంలో భిన్నమైన వ్యక్తులు ఉంటారు. కానీ వారితో కొన్ని అవసరాలు ఉంటాయి. కొందరు ఎంత మూర్ఖులైనా వారిని దూరం చేసుకోకుండా వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. మూర్ఖులు ఎక్కువగా గర్వంతో నిండి ఉంటారు. తమ మాటే వినాలని పట్టుబడుతారు. తాము చెప్పిందే వినాలని ఆర్డర్ వేస్తుంటారు. ఇలాంటి వారు స్నేహితులు అయినా.. బంధువులు అయితే వారిని దూరం చేసుకోవద్దని అనుకుంటే వారు చెప్పిందే వినాలి. కొన్నిసార్లు వారిదారిలోనే వెళ్తూ వారిని పొగడుతూ ఉండాలి. అప్పుడు వారు దారిలోకి వచ్చి ఒక్కోసారి ఇతరులు చెప్పే మాటలు వింటారు.
ముర్ఖులకు భిన్నంగా బుద్ధిమంతులు ఉంటారు. కానీ మూర్ఖులను మెప్పించినంత తేలికగా బుద్ధిమంతులను ఒప్పించలేదు. ఎందుకంటే బుద్దిమంతులు ఎక్కువగా కొత్తవారితో స్నేహం చేయరు. వారికి పొగడ్తలు అంటే ఇష్టం ఉండదు. అబద్దాలు మాట్లాడే వారికి వీరు దూరంగా ఉంటారు. ఇలాంటి వారిని ఆకట్టుకోవాలంటే ఎప్పుడూ వారితో నిజాలే మాట్లాడాలి. కొన్ని నిజాయితీగల పనులు వారి ముందర చేయడం వల్ల వారిని ఆకర్షించుకోవచ్చు. ఒక్క సారి బుద్ధిమంతులతో స్నేహం ప్రారంభం అయితే కొన్నాళ్ల పాటు వారితోనే కొనసాగుతారు.
ఈ రెండు రకాల మనుషులు మాత్రమే కాకుండా డబ్బుపై అత్యాశగల వ్యక్తులు ఉంటారు. అయితే వీరిని ఆకట్టుకోవాలంటే డబ్బే ప్రధానం. కొన్ని విషయాలు అనుకున్నట్లు కావాలంటే వారికి కావాల్సిన డబ్బును ఇవ్వడం వల్ల వారిని ఆకర్షించగలుగుతారు. ధనంతో సమానమైన వస్తువులు ఇవ్వడం వల్ల వారు ఏ పని చెప్పినా చేయడానికి రెడీ అవుతారు. అడిగిన దానికంటే ఎక్కువగా డబ్బు ఇవ్వడం వల్ల బానిసలుగా మారే అవకాశం ఉంది. అందువల్ల అత్యాశ గల వ్యక్తులతను డబ్బుతో కొనవచ్చు.
వీరే కాకుండా ఆయా వ్యక్తులు తమ మనస్తత్వాల గురించి తెలుసుకొని వారి దారిలోనే వెళ్లాలి. ఆ తరువాత వారిని అనుగుణంగా ఉన్న తరువాత వారి మనసు మారే అవకాశం ఉంటుంది. అప్పుడు అనుకున్న వ్యక్తి తన దారిలోకి ఇలాంటి వ్యక్తులు వస్తారు. అప్పుడు తమ అవసరాలు తీర్చుకోవచ్చు. అయితే ఏ పని చేసినా నిజాయితీగా ఉండాలని చాణక్య నీతి చెబుతుంది. అప్పుడే అలాంటి వ్యక్తుల నుంచి సరైన న్యాయం జరుగుతుందని చెబుతున్నాడు.