Women Bra : బ్రా ధరించడం వల్ల ఇన్ని నష్టాలా? మరేం చేయాలి?

బ్రా ధరించడం వల్ల మేలు కంటే నష్టమే ఎక్కువగా ఉందని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ వంటివి రావడానికి ఇవి ధరించడమేనని కొందరు అంటున్నారు. అయితే బ్రా వేసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయో చూద్దాం..

Written By: Srinivas, Updated On : October 15, 2024 5:30 pm

Women Bra

Follow us on

Women Bra :  మనుషులకు దుస్తులు అందాన్ని ఇస్తాయి. ఒకప్పుడు సరైన ఆదాయం లేక కొంత మంది మగవాళ్లు పై వస్త్రం వేసుకునే వాళ్లు కాదు. ఆ తరువాత ఖాదీ వస్త్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్నందున కొత్త కొత్త రకమైన దుస్తులు ధరిస్తున్నారు ఇప్పుడున్న కాలంలో మగవారు ఎక్కువగా జీన్స్ షర్ట్, లేదా జీన్స్ టీషర్ట్ ధరిస్తున్నారు. ఆడవాళ్లు కొందరు సారీ ధరించినా.. నగరాలు, పట్టణాల్లో ఉండేవారు ఎక్కువగా పంజాబీ, తదితర డ్రెస్సులు వాడుతున్నారు. అయితే కొంత మంది లో దుస్తులు కూడా ధరిస్తూ ఉంటారు.వీటిలో ఎక్కువగా బ్రా ధరించే వారు లేకపోలేదు. అయితే కొన్ని ఆరోగ్య కరమైన ప్రయోజనాల దృష్ట్యా బ్రా వేసుకుంటామని అంటారు. కానీ దీనిని ధరించడం వల్ల మేలు కంటే నష్టమే ఎక్కువగా ఉందని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ వంటివి రావడానికి ఇవి ధరించడమేనని కొందరు అంటున్నారు. అయితే బ్రా వేసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయో చూద్దాం..

కొంతమంది చెబుతన్న ప్రకారం.. బ్రా ను ధరించడం వల్ల చెస్ట్ చాలా బిగుతుగా ఉంటుందని అనుకుంటారు. కానీ దీనిని ధరించడం వల్ల స్కిన్ ను ఒకచోట కట్టిపడేసినట్లు అవుతుంది. దీంతో రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడుతాయి. రకప్రసరణలో అంతరాయం ఏర్పడడం వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. శరీంలోని ప్రతీ చోట గాలి వెళ్లడం ద్వారా కొన్ని క్రిములు నాశనం అవుతూ ఉంటాయి.అలా గాలి చొరబడకుండా ఉండడం వల్ల కొన్ని క్రిములు అక్కడే ఉంటాయి. బ్రా ధరించడం వల్ల ఆ ప్రదేశంలో గాలి చొరబడక అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

నిద్రిస్తున్న సమయంలో వదులుగా ఉండే దుస్తులు వేసుకోవాలని ఇప్పటికే కొంతమంది ఆరోగ్య నిపుణులు చెప్పారు. అయితే కొంత మంది బ్రా ధరించి నిద్రిస్తారు. ఇలా చేయడం వల్ల రాత్రి సమయంలో రక్త ప్రసరణ సరిగ్గా ఉండకపోవడంతో మంచి నిద్ర ఉండదు. దీంతో నిద్రలేమి సమస్యలతో బాధపడుతారు. కొందరు ఎక్కువగా వెయిట్ ఉన్న వారికి ఇది మరింత ఇబ్బందిని కలిగిస్తుంది. అందువల్ల రాత్రి సమయంలో దీనిని తీసివేయడం ఉత్తమం అని అంటున్నారు.

నిత్యం బ్రా ధరించే వారిలో అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో రొమ్ము క్యాన్సర్ కూడా ఉంటుందని అంటున్నారు. ఇలాంటి వారిలో రొమ్ము గడ్డలు వచ్చే అవకాశం లేకపోలేదని చెబుతన్నారు. అలాగే రొమ్ము క్యాన్సర్ రావడానికి ఈ అలవాటు ఒక కారణంగా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా బిగుతుగా ఉండే బ్రా లు ధరించడం వల్ల రొమ్ములలో నొప్పి కలిగి దీర్ఘ కాలిక వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని అంటున్నారు.

వేసవి కాలంలో ఎక్కువగా బ్రా ధరించే వారిలో ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. ఆ ప్రదేశంలో తేమతో ఉండడం వల్ల బ్యాక్టీరియా వచ్చే అవకాశం ఉంది. దీంతో దురద, దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల సాధ్యమైనంత వరకు వేసవి కాలంలో బ్రా ధరించ కుండా ఉండడమే మంచిదని అంటున్నారు. అయితే బయటకు వెళ్లే సమయంలో అవసరం అయిన వారు దీనిని ధరించినా.. ఆ తరువాత తీసేవేయడం వల్ల ప్రశాంతంగా ఉంటారని చెబుతున్నారు.