Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Vs Jagan Mohan Reddy: పవన్ జగన్ మధ్య యుద్ధం మొదలైనట్టేనా?

Pawan Kalyan Vs Jagan Mohan Reddy: పవన్ జగన్ మధ్య యుద్ధం మొదలైనట్టేనా?

Pawan Kalyan Vs Jagan Mohan Reddy: ఏపీలో నెయ్యి కల్తీ వ్యవహారం దుమారం రేపుతోంది. గత కొన్ని నెలలుగా ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టింది. కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే నెయ్యిలో జంతు కొవ్వు లేదని.. కానీ అది అసలు పాలతో తయారుచేసిన నెయ్యి కాదని.. లీటర్ పాలు కూడా వినియోగించ లేదని మాత్రం స్పష్టం చేసింది. పామాయిల్ తో కూడిన రసాయనాలు కలిపారని తెలిసింది. అయితే ఇక్కడే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యంతరం తెలిపింది. జంతు కొవ్వు కలపలేదని తేల్చడం ద్వారా ప్రభుత్వం కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో మాట్లాడుకుందని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే అసలు పాలే లేని తయారు చేసిన నెయ్యితో లడ్డూలు తయారుచేసి కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ పరస్పర ఆరోపణలతో, విమర్శలతో పరిస్థితి మరింత వేడెక్కింది. మరోవైపు శాసనసభ దీనిపై నిన్ననే సుదీర్ఘ చర్చ జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పై యుద్ధం ప్రకటించిన అంత పని చేశారు.

Also Read: లోకేష్ తలచుకుంటే అంతే!

* కేవలం వ్యవస్థీకృత ఆరోపణ..
నెయ్యి కల్తీ( ghee adulteration ) వ్యవహారంపై తాము వ్యక్తిగత ఆరోపణలు చేయలేదని.. వ్యవస్థీకృత ఆరోపణలు మాత్రమే చేశామని గుర్తు చేశారు పవన్. జంతు కొవ్వు కలపలేదన్న విషయాన్ని పక్కన పెడితే.. కల్తీ జరిగిందని సిట్ స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. పామాయిల్ తో కూడిన రసాయనాలు కలిపారని.. కచ్చితంగా కల్తీ జరిగిందని సిట్ చెబుతుంటే.. దానిని వదిలి ఎంతవరకు జంతు కొవ్వు ప్రస్తావన తీసుకురావడం ఏమిటనే ప్రశ్న ఆయన నుంచి వచ్చింది. ఆనాడే క్షమాపణ కోరి.. పశ్చాత్తాపం వ్యక్తం చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. తప్పు చేసి దొరికిపోయిన టీటీడీ పాలకమండలిని అప్పటి ప్రభుత్వం, ఇప్పటి ప్రతిపక్షం వెనుకేసుకు రావడం ఏమిటని నిలదీశారు. కచ్చితంగా వైసిపి ప్రభుత్వం కానీ..పాలక పక్షంగాని తప్పు చేసి ఉంటే తీవ్రస్థాయిలో మూల్యం చెల్లించుకుంటారని.. తరాలు కూడా లేచిపోతాయి అంటూ స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్.

* తన పశ్చాత్తాప దీక్ష గురించి
నెయ్యి కల్తీ జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం( special investigation team ) విచారణలో తేలిన తరువాత కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బుకాయింపును తప్పు పట్టారు పవన్ కళ్యాణ్. ఆరోజు తాను సనాతన ధర్మ పరిరక్షణ ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించారు. పశ్చాత్తాప దీక్ష చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా.. నెయ్యి కల్తీ జరిగితే ఎందుకు హిందువుల నుంచి ఆ స్థాయిలో ప్రతిఘటన రాలేదని ప్రశ్నించారు. ఇదే ఒక ముస్లింలకు, క్రైస్తవుల విషయంలో జరిగి ఉంటే ప్రపంచమే గగ్గోలు పెట్టేదని చెప్పుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పారు. తద్వారా అప్పటి పాలకమండలి పై చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుపట్టారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి పై యుద్ధం ప్రకటించినట్లు అయింది. నెయ్యి కల్తీ విషయంలో జగన్మోహన్ రెడ్డి పై తాము ఆరోపణలు చేయలేదని పవన్ చెబుతుంటే.. జగన్మోహన్ రెడ్డి మాత్రం నేరుగా చంద్రబాబుతో పాటు పవన్ ను టార్గెట్ చేసుకుంటున్నారు. పవన్ మాత్రం వ్యూహాత్మకంగా జగన్ పైనే యుద్ధం అన్నట్టు.. మాటల దాడి మొదలెట్టారు. మొత్తానికి అయితే నెయ్యి కల్తీ అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version