https://oktelugu.com/

Milk : ప్యాకెట్ పాలను మరిగిస్తున్నారా? ఇంతకీ ఇలా చేయవచ్చా?

పాలను పాశ్చరైజేషన్ చేసిన తర్వాతే ప్యాకింగ్ చేస్తుంటారు. అంటే పాలలోని ప్రమాదకర బ్యాక్టీరియాను నాశనం చేయడానికి ప్రత్యేక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయాల్సి ఉంటుంది. అంటే ఈ పాలను కచ్చితంగా 71డిగ్రీల సెల్సియస్ వద్ద వాటిని వేడి చేసి మళ్లీ సున్నా డిగ్రీల వద్ద చల్లబరుస్తుంటారు. అనంతరం వాటిని ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేస్తారు. దీని వల్ల వివిధ రకాల అనారోగ్యాలు, వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా చనిపోతుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : October 15, 2024 8:49 pm

    Milk

    Follow us on

    Milk : పాలలో అనేక పోషక విలువలు ఉంటాయి. పాలలో ఉండే కాల్షియం మన ఎముకలను దృఢంగా చేయడానికి సహాయం చేస్తుంది. అందుకే చిన్నపిల్లలు, వృద్ధులు ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు తాగాలి అంటారు వైద్యులు. పాలలో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కూడా. అయితే, మన దేశంలో అందరూ దాదాపు పాలను మరిగించిన తర్వాతే ఉపయోగిస్తారనే విషయం తెలిసిందే. ఇది మన పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఆచరించదగ్గ ఆచారం కూడా. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ప్యాకెట్‌ పాలను ఎక్కువ సేపు మరిగిస్తున్నారు చాలా మంది. కానీ ఇలా చేయవద్దు అంటున్నారు డైటీషియన్లు. మరి ఎక్కువ సేపు పాలను మరిగిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

    పూర్వ కాలంలో గెదేలు, ఆవులు ఉన్న వారింటికి వెళ్లి అప్పుడే తీసిన పాలను తెచ్చుకొని సంతోషంగా తాగేవారు. టీ ప్రిపేర్ చేసుకునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఏకంగా గ్రామాలలో కూడా పాల ప్యాకెట్లు వచ్చాయి. అయితే, స్థానికంగా పాలను కొన్నప్పుడు కచ్చితంగా వేడి చేయాల్సిందే. లేకపోతే బ్యాక్టీరియా నాశనం కాదు. పాలను వేడి చేయడానికి ముఖ్య కారణం అదే. ఇక ఈ ప్యాకెట్ పాలను వేడి చేయడం వల్ల వచ్చే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయి అంటున్నారు నిపుణులు.

    పాలను పాశ్చరైజేషన్ చేసిన తర్వాతే ప్యాకింగ్ చేస్తుంటారు. అంటే పాలలోని ప్రమాదకర బ్యాక్టీరియాను నాశనం చేయడానికి ప్రత్యేక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయాల్సి ఉంటుంది. అంటే ఈ పాలను కచ్చితంగా 71డిగ్రీల సెల్సియస్ వద్ద వాటిని వేడి చేసి మళ్లీ సున్నా డిగ్రీల వద్ద చల్లబరుస్తుంటారు. అనంతరం వాటిని ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేస్తారు. దీని వల్ల వివిధ రకాల అనారోగ్యాలు, వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా చనిపోతుంది. ఈ విధానంలో మైక్రో ఆర్గానిజంల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి పాలను వాడుకునేందుకు అనువుగా మారుతాయి. ఇలాంటి పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

    అయితే 71డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేసి చల్లబరిచిన పాలను మళ్లీ మనం అతిగా వేడి చేయడం వల్ల చాలా నష్టం జరుగుతుంది అంటున్నారు నిపుణులు. ఇలా చేస్తే అందులోని పోషక విలువలు దెబ్బతింటాయి.ప్యాకెట్ పాలను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా వేడి చేయడం వల్ల అందులోని విటమిన్ సి, విటమిన్ బి, ప్రోటీన్లు కూడా పోతాయని నిపుణులు చెబుతున్నారు. ప్యాకెట్ బాగా ఉండి, సరిగ్గా స్టోర్ చేసి ఉంటే ప్యాకెట్ పాలను మరిగించకుండా వాడటమే మంచిది అంటున్నారు నిపుణులు.

    ప్యాకెట్ పాలు కాకుండా నేరుగా డైరీ నుంచి తీసుకొచ్చిన పాలను మాత్రం కచ్చితంగా వేడి చేయాల్సిందే. లేకపోతే హానికర బ్యాక్టీరియా శరీరంలోకి చేరిపోతుంది. అయితే ఈ ప్యాకెట్ పాలను పొంగే వరకు కాకుండా గోరు వెచ్చగా వేడి చేయాలి. బ్యాక్టీరియా నాశనం అయి అవసరమైన పోషకాలు మిగులుతాయి.

    అలాగే ప్యాకెట్ పాలను వాడేవారు కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలి. పాలు పొయ్యి మీద పెట్టి ఐదు నిమిషాలపాటు వేడి చేస్తే చాలు. అంతకు మించి వాటిని వేడి చేయవద్దు అని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఏ రోజు ప్యాకెట్ పాలను ఆ రోజే వాడుకోవాలి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు..