Best investment options: డబ్బు అందరూ సంపాదిస్తారు. కానీ కొందరు మాత్రమే ధనవంతులు ఎందుకు అవుతున్నారు? అన్న ప్రశ్న చాలా మదిలో ఉంటుంది. కొందరు వారికి అదృష్టం ఉందని అంటుంటారు.. మరికొందరు వారికి చిన్నప్పటి నుంచే ధనం ఉందని చెబుతుంటారు. కానీ కొన్ని చరిత్రలను చూస్తే ఎలాంటి సపోర్ట్ లేకుండా.. ఏ విధమైన ఆర్థిక పరిస్థితులు లేని వారు సైతం ఉన్నత స్థితిలో ఉండిపోయారు. అందుకు కారణం వారు సరైన విధంగా డబ్బులు మలచడమే. చాలామంది ఉద్యోగం, వ్యాపారం చేసి ఆదాయాన్ని పొందుతారు. కానీ వచ్చిన ఆదాయాన్ని సరైన మార్గంలో పెట్టుబడులు పెట్టకపోవడమే ఆదాయం పెరగకపోవడానికి కారణం. అయితే ఇలా పెట్టుబడులు పెట్టేటప్పుడు కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి. ఇందులో అధిక ఆదాయం వచ్చే పెట్టుబడులు పెట్టాలా? లేదా డబ్బు సురక్షితంగా ఉంటే చాలు.. తక్కువ రాబడి వచ్చిన పర్వాలేదు? అని అనుకోవాలా? ఇలాంటి పెట్టుబడులు ఎవరికి అవసరం?
ప్రతి ఒక్కరికి డబ్బు రెట్టింపు కావాలన్న ఆశ ఉంటుంది. అయితే మరి కొందరికి మాత్రం రెట్టింపు అవసరం లేదు కానీ నష్టం జరగకుండా ఉంటే చాలు అని అనుకుంటారు. డబ్బు రెట్టింపు కావాలని అనుకునేవారు కాస్త రిస్క్ చేయాల్సి ఉంటుంది. అంటే వీరు పెట్టే పెట్టుబడులు లాభం రావచ్చు.. రాకపోవచ్చు.. కానీ వస్తే మాత్రం అధిక రెట్ల రెట్టింపు లాభ ఉంటుంది. దీనికి కొంచెం ధైర్యం చేయాలి. అందుకోసం ఆర్థికంగా సపోర్టు ఉండాలి. అలాంటివారికి ఈ పెట్టుబడును అనుగుణంగా ఉంటాయి. స్టాక్ మార్కెట్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ వంటివి హై రిస్క్ తో కూడుకొని ఉంటాయి. ఇందులో లాభం వస్తే ఎక్కువగా ఉంటుంది.. నష్టం కూడా అంతే స్థాయిలో ఉంటుంది.
అయితే ఆర్థికంగా ఎదుగుతున్న వారు.. ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేని వారు ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటారు. ఇలాంటివారు మద్యస్థ పెట్టుబడులు ఎంచుకోవడం మంచిది. అంటే వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే పరిస్థితులను బట్టి డబ్బు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. లేదా అలాగే ఉండిపోతుంది. కానీ నష్టం మాత్రం ఉండదు. ఇందులో ఎక్కువ మొత్తంలో కాకుండా దీర్ఘకాలిక అవసరాల కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది అని నిపుణులు తెలుపుతున్నారు.
ఇక తక్కువ రిస్కు ఉండే పెట్టుబడులు. ఈ పెట్టుబడులను సాధారణ వ్యక్తులు కూడా చేయవచ్చు. వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాబడి తక్కువగా ఉంటుంది. కానీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలా తీసుకున్నప్పుడు ఎలాంటి అదనపు చార్జీలు ఉండవు. ఇలాంటి పెట్టుబడిలో ఆరు నుంచి ఏడు శాతం మాత్రమే వడ్డీ రేటు ఉంటుంది. బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్ వంటివి ఇలాంటి పెట్టుబడులు.
అయితే ఎలాంటి పెట్టుబడులు పెట్టాలి? అన్న సందేహం చాలా మందికి వస్తుంది. దీర్ఘకాలికంగా అవసరాలకు ఉపయోగించుకోవాలి అనుకునేవారు తక్కువ రిస్కుతో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. హైరిస్కు పెట్టుబడుల విషయంలో కొంత మొత్తాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఏర్పాటు చేసుకునే మొత్తం అప్పు చేయకుండా ఉంటే బెటర్. బ్యాంకులో నిల్వ ఉండే కంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక్కోసారి లాభం అధికంగా రావచ్చు. ఈ విధంగా వారి పరిస్థితిలకు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అని నిపుణులు తెలుపుతున్నారు.