Marriage: 30 ఏళ్లు దాటాక పెళ్లి చేసుకుంటే ఈ సమస్యలు తప్పవు..

ఇప్పుడు 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోవడం లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఈ విధంగా 30 సంవత్సరాలు దాటిన తరువాత పెళ్లి చేసుకునే వారికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Written By: Swathi, Updated On : April 26, 2024 3:59 pm

marriage after 30 years

Follow us on

Marriage: సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ‘పెళ్లి’ అనేది ముఖ్యమైనది. ప్రస్తుతం ఎవరికీ నచ్చినట్లు, నచ్చిన వయసులో వివాహం చేసుకుంటున్నారు. అయితే ఇది వరకు చిన్న వయసులోనే వివాహాలను చేసే వారు. కానీ ఇప్పుడు 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోవడం లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఈ విధంగా 30 సంవత్సరాలు దాటిన తరువాత పెళ్లి చేసుకునే వారికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుత బిజీ కాలంలో ప్రతి ఒక్కరూ లైఫ్ లో సెటిల్ అయిన తరువాతే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం కెరీర్ ను ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు. మంచి ఉద్యోగం వచ్చిన తరువాతే చాలా మంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే 30 ఏళ్లు వచ్చిన వారిలో జీవితంలో ఎలా స్థిర పడాలి.. ఎలా సంపాదించాలిన అనే ఆలోచనే ఎక్కువగా ఉంటుందంట. అంతేకానీ భాగస్వామితో ఎలా గడపాలి? జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి అనే ఆలోచన రాదట.

భాగస్వామికి ఎక్కువగా సమయాన్ని కేటాయించారని తెలుస్తోంది. దీని వలన భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. పాతికేళ్ల లోపు లేదా పాతికేళ్ల వయసు పెళ్లికి అనువైన సమయమట. పాతికేళ్లు నిండగానే వివాహం చేసుకుంటే పిల్లలను కనడానికి సరైన వయసు అని పెద్దలు చెబుతున్నారు. పెళ్లి ఆలస్యం కావడం వలన పిల్లలు యవ్వన వయసుకు వచ్చే సరికి తల్లిదండ్రులు ముసలి వారు అయ్యే ప్రమాదం ఉంది.

30 ఏళ్ల తరువాత పెళ్లి చేసుకునే వారు పిల్లలను కూడా లేట్ గా కనడం వలన ఇబ్బందులు వస్తాయట. దాని వలన పిల్లల పెళ్లి బాధ్యతలను సైతం నెరవేర్చలేని పరిస్థితులు వస్తాయని తెలుస్తోంది. అందుకే 30 ఏళ్ల తరువాత పెళ్లి చేసుకోకుండా.. ముందుగానే పాతికేళ్ల వయసులోనే వివాహం చేసుకోవాలని చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వలన ఐదేళ్ల పాటు జీవితాన్ని ఆస్వాదించడంతో పాటు ఆ తరువాత కెరీర్ పై దృష్టి సారించవచ్చు.

అయితే పెళ్లి అనేది ప్రతి ఒక్కరికీ పర్సనల్ విషయం. ఎప్పుడు, ఏ సమయంలో ఏం చేయాలనేది ప్రతి ఒక్కరికీ క్లారిటీ ఉంటుంది. కానీ లేటుగా వివాహం చేసుకుంటే ఈ ఇబ్బందులు తప్పవని మానసిక నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.