MAadhaar: ఆఫ్ లైన్ లో కూడా ‘M-Adhar’తో ఎక్కువ ప్రయోజనాలు.. ఎలా పనిచేస్తుందంటే..?

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడీఏఐ) ‘M-Adhar’ అప్లికేషన్ (యాప్) తీసుకువచ్చింది. ప్రజలు తమ ఆధార్ కార్డు వివరాలను స్మార్ట్ ఫోన్ లలో చూసుకునేందుకు ఈ యాప్ అనుమతిస్తుంది.

Written By: Neelambaram, Updated On : May 29, 2024 12:07 pm

MAadhaar

Follow us on

MAadhaar: రాను రాను పేపర్ వర్క్ లేకుండా పోతోంది. గతంలో ఐడెంటిఫికేషన్ నుంచి ప్రతీ ఒక్కటి ఇన్సూరెన్స్, లైసెన్స్, యునిక్ ఐడీ కార్డు, వెహికిల్ పేపర్స్ ఇలా ప్రతీ ఒక్కటి పేపర్లను చూసి మాత్రమే నమ్మేవారు కానీ రోజులు మారాయి. పేపర్ వర్క్ కనిపించడం లేదు. దేనికైనా స్మార్ట్ ఫోన్ అందులో అవసరమైన యాప్స్ ఉంటే చాలు అన్నీ ఉన్నట్లే. ఆధార్ కార్డు కోసం ఈ యాప్ వాడితే ఆఫ్ లైన్ లో కూడా ఆధార్ అందుబాటులో ఉంటుంది.

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడీఏఐ) ‘M-Adhar’ అప్లికేషన్ (యాప్) తీసుకువచ్చింది. ప్రజలు తమ ఆధార్ కార్డు వివరాలను స్మార్ట్ ఫోన్ లలో చూసుకునేందుకు ఈ యాప్ అనుమతిస్తుంది. వివిధ ప్రయోజనాల కోసం వారి డెమోగ్రాఫిక్ వివరాలు, చిరునామా, క్యూఆర్ కోడ్ వంటి సమాచారాన్ని వేగంగా, సులభంగా యాక్సెస్ చేసేందుకు ఈ యాప్ వీలు కల్పిస్తుంది.

ఎలా ఫ్రొఫైల్ క్రికెట్ చేయాలి?
యూఐడీఏఐ ప్రకారం.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఆధార్ ను లింక్ చేసిన వ్యక్తులు మాత్రమే దీన్ని చేయగలరు. స్మార్ట్ ఫోన్ లో M-Adhar యాప్ ఇన్ స్టాల్ చేసుకున్న తర్వత ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చని, దీనికి సంబంధించిన ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ కు మాత్రమే వెళ్తుందని తెలిపింది.

ప్రొఫైల్ క్రియేట్ స్టెప్స్
1. ఏదైనా ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లు ఓపెన్ చేసి పైన ‘రిజిస్టర్ ఆధార్’ ఎంచుకోండి.
2. ప్రొఫైల్ ను యాక్సెస్ చేసేందుకు 4 అంకెల PIN/పాస్ వర్డ్ జనరేట్ చేయండి.
3. మీ ఆధార్ నెంబర్, అలాగే క్యాప్చా కోడ్ ను ఇన్పుట్ చేయండి.. ఇప్పుడు మీకు ఓటీపీ వస్తుంది.
4. ఓటీపీ ఎంటర్ చేయండి, ‘సబ్మిట్’ నొక్కండి.
5. విజయవంతంగా పూర్తయిన తర్వాత, ప్రొఫైల్ నమోదు చేయబడుతుంది (‘రిజిస్టర్డ్’ ట్యాబ్ ఆధార్ తో సంబంధం ఉన్న పేరును చూపిస్తుంది.)
6. చివరగా, దిగువ మెనూలోని ‘మై ఆధార్’కు నావిగేట్ చేయండి, డ్యాష్ బోర్డ్ ను యాక్సెస్ చేసేందుకు పిన్ / పాస్వర్డ్ ను నమోదు చేయండి.

M-Adharతో ప్రయోజనాలు
1. ఆధార్ వివరాలను ఆఫ్ లైన్ మోడ్ లో కూడా చూడవచ్చు.
2. ఒకే స్మార్ట్ ఫోన్ లో, ఐదుగురు కుటుంబ సభ్యుల ఆధార్ సమాచారాన్ని నిల్వ చేయవచ్చు.
3. గుర్తింపు ధృవీకరణ సామర్థ్యాన్ని పెంచేందుకు, వినియోగదారులు e-kyc (నో యువర్ కస్టమర్) లేదా క్యూఆర్ కోడ్ ను సర్వీస్ ప్రొవైడర్లతో పంచుకోవచ్చు.
4. అదనపు రక్షణ కొరకు భద్రతా చర్యలు/బయోమెట్రిక్ ఉన్నాయి.