Australia: విమానంలో నగ్నంగా పరుగులు.. ప్రయాణికులకు షాక్‌..!

ఆస్ట్రేలియాలోని పెర్త్‌ నుంచి మెల్‌బోర్న్‌కు సోమవారం రాత్రి వీఏ 696 విమానం బయల్దేరింది. విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే ఓ ప్రయాణికుడి ప్రవర్తన చూసి అందా షాక్‌ అయ్యారు.

Written By: Raj Shekar, Updated On : May 29, 2024 12:20 pm

Australia

Follow us on

Australia: ఇంతకాలం మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లోనే వెకిలిచ చేష్టలు చూశాం. ఇప్పుడు విమానాల్లోనూ ఈ సంస్కృతి పెరుగుతోంది. ప్రయాణికులపై ఉమ్మడం.. డాన్సులు చేయడం, అత్యవస ద్వారం తెరవడం, దాడులు చేయడం వంటి ఘటనలు జరిగాయి. తాజాగా ఓ ప్రయాణికుడు నగ్నంగా పరుగులు పెట్టాడు. ఈ ఘటన ఆస్ట్రేలియా విమానంలో జరిగింది. దీంతో ప్రయాణికులు షాక్‌ అయ్యారు.

గందరగోళం..
ఆస్ట్రేలియాలోని పెర్త్‌ నుంచి మెల్‌బోర్న్‌కు సోమవారం రాత్రి వీఏ 696 విమానం బయల్దేరింది. విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే ఓ ప్రయాణికుడి ప్రవర్తన చూసి అందా షాక్‌ అయ్యారు. సదరు ప్రయాణికుడు తన ఒంటిపై దుస్తులు తొలగించి నగ్నంగా అటూఇటూ తిరిగాడు. పరుగులు పెట్టాడు. అడ్డుకున్న సిబ్బందిని తోసి కిందపడేశాడు. అతడి చర్యతో ప్రయాణికులు ఆందోళన చెందారు. దీంతో విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లించారు.

అదుపులోకి తీసుకున్న పోలీసులు..
ప్రయాణికుడు ఎంత వారించినా తీరుమార్చుకోకపోవడంతో విమాన సిబ్బంది విమానాశ్రయానికి సమాచారం అందించారు. వెంటనే ఎయిర్‌ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ఏర్పాటు చేశారు. వెనక్కి వచ్చిన విమానం ల్యాండ్‌ కాగానే అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేస్తున్నారు. అతను అలా ఎందుకు ప్రవర్తించారు అనేది తెలియడం లేదు. ఆ వ్యక్తి ప్రవర్తనపై ఎయిర్‌లైన్స్‌ సంస్థ స్పందించింది. అతని వల్ల ప్రయాణికులకు ఎదురైన అసౌకర్యానికి క్షమాపణ కోరింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించింది.