https://oktelugu.com/

Aadhaar Update: ఆధార్ అప్డేట్ చేయాలనుకుంటున్నారా? ఈ విషయాల్లో జాగ్రత్త..

ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే 2023 తరువాత సస్పెండ్ అవుతాయని కేంద్రప్రభుత్వం తెలిపింది. అందువల్ల సాధ్యమైనంత తొందరగా దగ్గర్లోని సెంటర్ కు వెళ్లి మార్చకోవడం బెటర్. ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే ఈ కార్డుతో లింకైన సేవలన్నీ నిలిచిపోతాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : May 16, 2023 / 03:33 PM IST

    Aadhaar Update

    Follow us on

    Aadhaar Update: భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికి ఆధార్ ముఖ్యమైనదిగా చేసింది ప్రభుత్వం. ఆధార్ తో అనేక సేవలను పొందవచ్చు. అయితే కొన్ని కారణాల వల్ల ఆధార్ అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ క్రమంలో చాలా మంది అనుమానాలు మొదలయ్యాయి. ఆధార్ అప్డేటేషన్ ఎలా చేసుకోవాలి? ఎక్కడ చేసుకోవాలి? అని. అంతేకాకుండా ఏవేవీ అప్డేట్ చేసుకోవాలి? అనే విషయాలపై కూడా క్లారిటీ లేదు. ఈ సందేహాలపై కొన్ని సూచనలు మీకోసం..

    భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐదేళ్లు నిండిన చిన్నారులు, పదేళ్లు ఎలాంటి అప్డేట్ చేయని వారు నవీకరించుకోవాలి. 2010 నుంచి 2016 వరకు ఆధార్ కార్డులు ఇచ్చేటప్పుడు ఎలాంటి ధ్రువపత్రాలు అడగలేదు. దీంతో చాలా ఆధార్ కార్డులు బోగస్ గా నమోదయ్యాయి. అందువల్ల వీటిని సరిచేయడానికి కూడా అప్డేట్ చేసుకోవాలని తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇంటి అడ్రస్, సరైన ఆధారాలను సమర్పించి అప్డేట్ చేసుకోవడం మంచిది. అలాగే 2016లోపు ఆధార్ తీసుకున్నవాళ్లు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు.

    ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే 2023 తరువాత సస్పెండ్ అవుతాయని కేంద్రప్రభుత్వం తెలిపింది. అందువల్ల సాధ్యమైనంత తొందరగా దగ్గర్లోని సెంటర్ కు వెళ్లి మార్చకోవడం బెటర్. ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే ఈ కార్డుతో లింకైన సేవలన్నీ నిలిచిపోతాయి. ముఖ్యంగా బ్యాంక్, గ్యాస్, తదితర లింకులన్నీ కట్ అయిపోతాయని చెబుతున్నారు. అయితే ఆధార్ అప్డేట్ చేసే సమయంలో ఇదివరకే ధ్రువపత్రాలు ఇచ్చి ఉంటే మళ్లీ సమర్పించాల్సిన అవసరం లేదు.

    ఆధార్ అప్డేట్ విషయంలో చాలా మంది ఫేక్ వెబ్ సైట్ల ను ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం ఆధారంగా నిర్వహించే మీసేవ సెంటర్లో లేదా ప్రముఖ సంస్థల్లోకి వెళ్లి అప్డేట్ చేయించుకోవాలి. అలాగే అధార్ అప్డేట్ కోసం కేవలం రూ.50 మాత్రమే చెల్లంచాలి. అదనంగా డబ్బులు అడిగితే సంబంధిత అధికారులకు పిర్యాదు చేయవచ్చు. ఇప్పటికైనా ఆధార్ పై నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆధార్ అప్డేట్ చేసుకోండి.