https://oktelugu.com/

Change signs in December: డిసెంబర్ లో రాశులు మారనున్న శుక్రుడు.. ఈ రాశుల వారికి సంపద పెరిగినట్లే..

వేద శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి మారుతూ ఉంటాయి. దీంతో ఈ రాశులతో సంబంధం ఉన్న వారి జీవితాల్లోనూ మార్పులు వస్తాయి. కొందరు కష్టాలు ఎదుర్కొంటున్న వాళ్లు.. ఇప్పటికే తీవ్ర బాధలో ఉన్న వారు గ్రహాల మార్పుతో వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : November 16, 2024 / 04:00 PM IST

    Zodiac

    Follow us on

    Change signs in December: వేద శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి మారుతూ ఉంటాయి. దీంతో ఈ రాశులతో సంబంధం ఉన్న వారి జీవితాల్లోనూ మార్పులు వస్తాయి. కొందరు కష్టాలు ఎదుర్కొంటున్న వాళ్లు.. ఇప్పటికే తీవ్ర బాధలో ఉన్న వారు గ్రహాల మార్పుతో వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. మరికొన్ని రాశుల వారికి అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. గ్రహాలన్నింటిలో శుక్రుడు అత్యంత ప్రకాశవంతమైనది. ఈ గ్రహం ఏ రాశిలో సంచరిస్తుందో ఆ రాశి వారు సంతోషంగా ఉంటారు. సంపదకు, సంతోషానికి కారణమయ్యే శుక్రుడు డిసెంబర్ లో కొన్ని రాశుల్లో సంచరించనున్నాడు. దీంతో ఆ రాశులతో సంబంధం ఉన్న వ్యక్తుల్లో సంతోషంతో పాటు సకల సంపదలు సిద్ధించనున్నాయి. మరి  ఏ రాశుల్లో శుక్రుడు సంచరిస్తున్నాడో తెలుసుకుందాం..

    జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ 2వ తేదీ నుంచి శుక్రుడు మకర రాశిలోకి ప్రశేశించనున్నాడు. ఆ తరువాత డిసెంబర్ 28న కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అయతే ఈ రెండు గ్రహాల్లో శుక్రుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. దీంతో కొందరు వ్యక్తుల జీవితాల్లో సంతోషాలు వెల్లి విరియనున్నాయి.

    శుక్ర గ్రహం మార్పు వల్ల వృషభ రాశిపై ప్రభావం పడనుంది. ఈ రాశి వారు డిసెంబర్ 2 నుంచి ఆర్థిక ప్రయోజాలు పొందుతారు. ఇప్పటి వరకు ఉన్న రుణాలు తీరుతాయి. వ్యాపారులకు అదనంగా ఆదాయం వస్తుంది. ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారు శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. విహార యాత్రలకు వెళ్లి ఉల్లాసంగా ఉంటారు. సాయంత్రం స్నేహితులను కలుస్తారు. కొత్తగా ప్రాజెక్టులకు అందుతాయి. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది.

    తుల రాశిపై శుక్రగ్రహం మార్పు ప్రభావం పడతుంది. దీంతో  ఈ రాశి ఉద్యోగులు పదోన్నతి పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లి విరుస్తుంది. వాహనాలపై ప్రయాణం చేస్తారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అప్పులన్నీ తీరుతాయి. రాజకీయాల్లో ఉండేవారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం కుటదుటపడుతుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థుల నుంచి శభవార్తలు వింటారు.

    శుక్రుడు డిసెంబర్ 2న మకర రాశిలో ప్రవేశించనున్నాడు. దీంతో ఆ రాశిపై ప్రభావం ఉండనుంది. ఊహించని విధంగా డబ్బు వస్తుంది.  కొన్ని పనులు చేపట్టడం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. కుటుంబంలో ఒకరు అనారోగ్యానికి గురవుతారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలపై ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.

    కుంభ రాశిపై కూడా శుక్రగ్రహం ప్రభావం ఉండనుంది. ఈ రాశివారికి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. కొత్తగా భాగస్వామ్య వ్యాపారం చేపడుతారు. జీవిత భాగస్వామితో కలిసి ఉల్లాసంగా ఉంటారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులకు ఇదే మంచి సమయం. ఆరోగ్యంగపై దృష్టి ఉంచాలి. చిన్న సమస్యలకైనా వైద్యులను సంప్రదించాలి.