Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ ప్రాంతంలో ఓ వ్యక్తి దగ్గర యువతులు టాటూలు వేయించుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆకృతిలో టాటూను తమ దేహం పై చిత్రీకరించుకున్నారు. అయితే అదే వారి పాలిట శత్రువైంది. మాయదారి రోగం తాలూకూ వైరస్ వారి శరీరంలో ప్రవేశించింది. వైద్యులు పరీక్షలు నిర్వహించగా ఈ షాకింగ్ విషయం తెలిసింది. ఒకరి కాదు, ఇద్దరు కాదు ఏకంగా 68 మంది లో ఆ వైరస్ లక్షణాలు ఉన్నట్టు తేలింది.. దీంతో ఆ యువతులు లబోదిబోమంటున్నారు. అయితే ఇది ఎలా వ్యాపించింది? ఏ మార్గాల ద్వారా వచ్చింది? అని అన్వేషించగా.. షాకింగ్ విషయం తెలిసింది.
ఒకటే నీడిల్ వాడారట..
ఘజియాబాద్ ప్రాంతంలో ఓ షాపింగ్ మాల్ ఉంది. అందులో ఆత్యాధునిక టాటూ వేసే కేంద్రం నడుస్తోంది. అక్కడ టాటూలు వేయించుకోవడానికి యువత భారీగా వెళుతుంటారు. పైగా ఘజియాబాద్ ప్రాంతంలో యువతకు టాటూలు వేయించుకోవడం విపరీతమైన ఇష్టం. ఆ ఇష్టంతోనే ఒక కళాశాలలో చదువుతున్న యువతులు వెళ్లారు. ఇలా మొత్తం 60 మంది తమకు ఇష్టమైన టాటూలు వేయించుకున్నారు. అయితే
టాటూ వేసిన వ్యక్తి ఒకటే నీడిల్ వాడారు. దానివల్ల ఆ యువతులకు హెచ్ఐవీ సో కింది. వైద్యుల పరీక్షలు ఈ షాకింగ్ నిజం వెలుగు చూసింది. దీంతో ఆ యువతులు లబోదిబోమంటున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ గా మారింది.. అయితే దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నేటి రోజుల్లో ఒకటే నీడిల్ తో ఒకరికి మాత్రమే టాటూ వేస్తున్నారని.. అలాంటిది అంతమందికి ఒకటే నీడిల్ ఎలా వాడతారని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో హైప్ కోసం ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఘజియాబాద్ ప్రాంతంలో అంతమందికి ఒకేసారి హెచ్ఐవీ సోకినట్టు ఇటీవల కాలంలో ఒక్క వార్త కూడా రాలేదని.. బహుశా ఇది ఫేక్ అయి ఉంటుందని చెబుతున్నారు. మరికొందరేమో కేవలం టాటూ లు వేసే చోటు మాత్రమే కాదు, సెలూన్ షాప్ లకు వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని.. అక్కడ కూడా బ్లేడ్ లు, కత్తెరలు మార్చకుండా ఉపయోగిస్తారని చెబుతున్నారు..”ఘజియాబాద్ ఉదంతం జరిగిందో, జరగలేదు తెలియదు. కానీ అది వింటుంటేనే భయం కలుగుతోంది. ఒకవేళ ఈ ఘటన విధంగా జరిగి ఉండి.. 60 మంది యువతుల్లో హెచ్ ఐవీ పాజిటివ్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో.. అది ఊహిస్తేనే ఇబ్బందికరంగా ఉందని” నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇలాంటి చోట్లకి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. లేనిపక్షంలో ఇలాంటి అనర్ధాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.. ఎందుకైనా మంచిది యువత ఇలాంటి ప్రాంతాలలో టాటూస్ వేసుకోకపోవడమే ఉత్తమం అని పేర్కొంటున్నారు.