Vehicle Insurance: ఇన్సూరెన్స్ అనే పేరు వినగానే చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్.. లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మాత్రమే మాట్లాడుతారు. అయితే వాహనాల ఇన్సూరెన్స్ విషయానికి వస్తే పెద్దవాడికి మాత్రమే ఉంటుంది. ద్విచక్ర వాహనాలకు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలని కొంతమంది మాత్రమే ఆలోచిస్తారు. వాస్తవానికి టూ వీలర్ కు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ ఉండాలి. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ ఇన్సూరెన్స్ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుతం చాలామంది ఈ ఇన్సూరెన్స్ చేయించుకోవడం లేదు. దీంతో ప్రభుత్వం ఇకనుంచి ఇన్సూరెన్స్ లేని వాహనాలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ఇన్సూరెన్స్ లేని వాహనాలకు జరిమానాలు అడపాదడపా వేస్తున్నా.. ఇకనుంచి మాత్రం కఠిన చర్యలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అసలు ద్విచక్ర వాహనానికి ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలి?
థర్డ్ పార్టీ బీమా ఇన్సూరెన్స్:
ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. అయితే దీనిని ఒక సంస్థ ద్వారా పొందాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వ్యక్తికి, వాహనానికి సంబంధించిన నష్టాలను నివారించడానికి ఇన్సూరెన్స్ పనిచేస్తుంది. ప్రత్యేకంగా ఒక కంపెనీ వ్యవహారాలను చూసుకుంటూ ఉంటుంది.
సమగ్ర బైక్ ఇన్సూరెన్స్:
దీనినే ఫుల్ ఇన్సూరెన్స్ అని కూడా అంటారు. దీని ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది అన్ని రకాలుగా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. బైక్ ప్రమాదాల నుంచి మాత్రమే కాకుండా.. దొంగతనం జరిగినప్పుడు, ప్రకృతి వైపరీత్యాల వల్ల బైక్ నష్టం జరిగినప్పుడు.. తదితర ఏదేని కారణాలవల్ల బైక్ నష్టపోయినప్పుడు ఆ నష్టాన్ని ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. ఈ రెండు ఇన్సూరెన్స్లో మాత్రమే కాకుండా అగ్ని ప్రమాదాల ద్వారా వాహనం ధ్వంసం అయినప్పుడు కూడా రికవరీ అయ్యేందుకు ఇండిపెండెంట్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.
అయితే పాలసీని తీసుకునే సమయంలో కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి.వాహనం నడిపే వారి పరిస్థితుల ఆధారంగా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎక్కువగా వాహనాలపై ప్రయాణం చేసేవారు సమగ్ర ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఉంటాయి. కేవలం కొన్ని అవసరాలకు మాత్రమే వాహనాన్ని నడిపేవారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. కానీ మొత్తానికి వాహనానికి ఇన్సూరెన్స్ ఉండడంవల్ల సెక్యూరిటీగా ఉంటుంది. వాహనానికి ఇన్సూరెన్స్ లేకుండా రోడ్డుపై నడపడం చట్టరీత్యా నేరం. అయితే గతంలోనూ వాహనాల తనిఖీ సమయంలో ఇన్సూరెన్స్ పేపర్స్ కచ్చితంగా అడుగుతారు. అయితే ఇకనుంచి ఈ విషయంలో కఠినంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.
కొత్త వాహనం కొనుగోలు చేసిన సమయంలో ప్రస్తుతం ఐదు సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. అయితే ఇప్పటివరకు వాహనాలు ఉన్నవారు ఇన్సూరెన్స్ లేకపోతే కచ్చితంగా చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోతే వేల రూపాయల్లో జరిమానా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హెల్మెట్, ట్రిపుల్ డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్ వంటి విషయాల్లో జరిమానా విధిస్తున్న పోలీసులు ఇకనుంచి ఇన్సూరెన్స్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుపుతున్నారు.