Vastu Tips: మనదేశంలో వాస్తు శాస్త్రానికి ఎంతో విలువ ఉంది. ప్రతి వస్తువును ఇంట్లోఎక్కడ ఉంచుకోవాలో వాస్తు చెబుతుంది. వాస్తు ప్రకారం వస్తువులు అమర్చుకోకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంట్లో వస్తువులు ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు. వస్తువులను విచ్చలవిడిగా ఉంచకూడదు. ప్రతి వస్తువును దాచుకునేందుకు ప్రత్యేకమైన చోటు ఉంటుంది. దీంతో వాస్తు శాస్త్రం సూచించిన విధంగా వస్తువులను చక్కగా అమర్చుకోవాలి. ఇల్లంతా చిందరవందరగా ఉంటే దారిద్ర్యం తాండవిస్తుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువుండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేకపోతే చిక్కులు వస్తాయనడంలో సందేహం లేదు.

ఇంటిపైన ఉండే టెర్రస్, స్టోర్ రూంలు చెత్తతో నిండిపోయాయంటే అశుభమే. దీంతో వీటిని ఎప్పుడు కూడా చెత్తరహితంగా ఉండేలా చూసుకోవాలి. ఇవి చెత్తతో నిండిపోతే ఎంత మాత్రం మంచిది కాదు. ఇంటి టెర్రస్ మీద చెత్త బాగా పేరుకుపోతే కుటుంబ సభ్యుల్లో ఘర్షణలు తలెత్తుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. స్టోర్ రూంలో కూడా వస్తువులు చిందరవందరగా ఉంటే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి. ప్రశాంతత దెబ్బతింటుంది. చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ చూపించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. టెర్రస్ పై ఎలాంటి వస్తువులు ఉంచకూడదు.
టెర్రస్ పై విరిగిపోయిన, పాడైపోయిన వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. విరిగిన కుర్చీలు, వాడని వస్తువులు ఉంచితే చెడు ప్రభావాలు కలుగుతాయి. ప్రతికూల ప్రభావాలు వస్తాయి. ఇంట్లో గొడవలు జరుగుతాయి. ఏ పరిస్థితుల్లో కూడా విరిగిపోయిన ఫర్నిచర్, మంచాలు, కుర్చీలు, టేబుళ్లు టెర్రస్ పై ఉంచితే దుష్ర్పభావాలు వస్తాయనడంలో సందేహం లేదు. అనవసర వస్తువులను ఇంటిపైన ఉంచకూడదు. టెర్రస్ పైనే చెత్త జమ చేస్తే వాస్తు దోషం కలుగుతుంది. ఇంట్లో వాతావరణం బాగుండదు. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి.

భవిష్యత్ లో ఉపయోగపడే వస్తువులను టెర్రస్ పై ఉంచుకుంటే వాటిపై గుడ్డ కప్పుకునే ఉంచుకుంటే ఏ సమస్య ఉండదు. వాడని వస్తువలను టెర్రస్ పై ఉంచుకుంటే మన నెత్తి మీద భారం పెట్టుకున్నట్లుగా అవుతుంది. అందుకే చెడిపోయిన వస్తువులను టెర్రస్ పై ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచుకోకూడదు. టెర్రస్ పరిశుభ్రంగా ఉంటే మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకున్నట్లే. ఈ నేపథ్యంలో టెర్రస్ పై ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం ఉంచకూడదని చెబుతున్నారు.