Super Star Krishna illness: సూపర్ స్టార్ కృష్ణ సడెన్ గా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఊపిరి తీసుకోవడం కష్టం కావడంతో వెంటనే ఆయనను హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. సోమవారం తన నివాసంలో అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యారు. కృష్ణ ఈ పరిస్తితికి గురికావడానికి ఆ ముగ్గురే కారణమట.. వారి వల్లే తీవ్ర మనోవేధనకు గురైన కృష్ణ ఈ పరిస్థితికి కారణమయ్యారని అంటున్నారు..

ఇటీవల కృష్ణ పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అంతేకాకుండా ఆయన భార్య, మహేష్ తల్లి ఇందిర మరణించిన సమయంలో కృష్ణ యాక్టివ్ గానే ఉన్నారు. అయితే ఇందిర మరణం.. అంతకుముందు పెద్ద కొడుకు రమేశ్ బాబు అకాల మరణం చెందడం.. ఇక ఈ సంవత్సరమే తనకు ఎంతో ఇష్టమైన రెండో భార్య విజయనిర్మల కూడా పరమపదించడంతో కృష్ణ ఒంటరితనం అనుభవిస్తున్నారు. ఒకే ఏడాదిలో ముగ్గురి మరణంతో ఆయన తట్టుకోలేకపోయారు. మానసికంగా డిస్ట్రబ్ అయ్యారు.
కొద్దిరోజులుగా వీరి ముగ్గురి మరణాన్ని తలుచుకుంటూ ఎమోషనల్ అవుతూ భావోద్వేగానికి గురి అవుతున్నాడట.. ఈ వృద్ధాప్యంలో ఆయనను చూసుకునే వారు లేకపోవడం.. ఒంటరితనం.. కూడా వేధిస్తోంది. అదే ఆలోచిస్తూ కృష్ణ మనోవేధనతో అస్వస్థతకు గురయ్యాడట.. డిప్రెషన్ కారణంగానే ఆయన అస్వస్థతకు గురయ్యాడట.. ఆయన పరిస్థితి కుదుట పడాలని మహేష్ ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు.
ఇక తల్లి మరణంతో కృంగిపోయిన మహేష్ బాబు.. ఇప్పుడు తండ్రికి అస్వస్థత అని తెలియడంతో హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆయన వెన్నంటే ఉండి బాగోగులు చూసుకుంటున్నారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారని.. కృష్ణ హెల్త్ బులిటెన్ కొద్దిసేపట్లో వైద్యులు విడుదల చేస్తారని తెలుస్తోంది. కృష్ణ ఆరోగ్యంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.