https://oktelugu.com/

ఇంట్లో డబ్బు నిలవడం లేదా.. కచ్చితంగా పాటించాల్సిన వాస్తు చిట్కాలు ఇవే!

ప్రతి మనిషి లైఫ్ లో డబ్బుకు ఉండే ప్రాధాన్యత, ప్రాముఖ్యత అంతాఇంతా కాదు. డబ్బు ఎంత ఎక్కువ మొత్తం ఉంటే జీవితంలో అంత సౌకర్యవంతంగా జీవనం సాగించే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది ఎంతమంది సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవడం లేదని బాధ పడుతూ ఉంటారు. ఆదాయంతో పోలిస్తే ఖర్చు ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది ఈ విధంగా భావిస్తారనే సంగతి తెలిసిందే. అయితే కొన్ని వాస్తు చిట్కాలు పాటించడం ద్వారా డబ్బు లోటు రాకుండా జాగ్రత్త […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 24, 2022 / 10:34 AM IST

    Vastu Tips

    Follow us on

    ప్రతి మనిషి లైఫ్ లో డబ్బుకు ఉండే ప్రాధాన్యత, ప్రాముఖ్యత అంతాఇంతా కాదు. డబ్బు ఎంత ఎక్కువ మొత్తం ఉంటే జీవితంలో అంత సౌకర్యవంతంగా జీవనం సాగించే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది ఎంతమంది సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవడం లేదని బాధ పడుతూ ఉంటారు. ఆదాయంతో పోలిస్తే ఖర్చు ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది ఈ విధంగా భావిస్తారనే సంగతి తెలిసిందే.

    అయితే కొన్ని వాస్తు చిట్కాలు పాటించడం ద్వారా డబ్బు లోటు రాకుండా జాగ్రత్త పడవచ్చు. డబ్బును సరైన దిశలో ఉంచడం ద్వారా డబ్బు వృథాగా ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉండదని చెప్పాలి. ఇంటిలో లాకర్ ను నైరుతి దిశలో ఉంచితే మంచిదని చెప్పవచ్చు. పశ్చిమ దిశలో లాకర్ ను ఉంచితే డబ్బు వినాశనం జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. డబ్బును వేర్వేరు ప్రదేశాల్లో ఉంచడం వల్ల డబ్బు నిల్వ ఉండదు.

    ఉత్తర దిక్కులో కూడా డబ్బును నిల్వ ఉంచితే మంచిదని చెప్పవచ్చు. బీరువా ఇంటిలో ప్రవేశ ద్వారం నుంచి చూసిన వాళ్లకు కనిపించే విధంగా ఉంచడం మంచిది కాదు. కిచెన్‌లు, మెట్లు లేదా స్టోర్‌రూమ్‌ లకు దగ్గర్లో లేదా బాత్ రూమ్ దగ్గర డబ్బును ఉంచడం కరెక్ట్ కాదు. ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే డబ్బు నిల్వ ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    డబ్బు విషయంలో పొదుపు నియమాలను పాటించడం ద్వారా కూడా డబ్బును ఆదా చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకున్నా డబ్బు నిలవని పక్షంలో వాస్తు నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.