Netaji Statue: భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశభక్తి గురించి చెప్పడంలో తనదైన శైలిలో ప్రభావం చూపగలరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత జాతిని ఉద్దేశించి మోడీ చేసే కీలక ప్రసంగాల ద్వారా యువతకు, యావత్ భారత ప్రజలకు స్పష్టమైన సందేశాన్ని అందించగలిగే సామర్థ్యం ఉంది. తాజాగా ఈ నేతాజీ త్యాగాలను గుర్తు చేస్తూ ప్రధాని మోడీ చేసిన ప్రసంగం చర్చనీయాంశమవుతున్నది. దేశ ప్రజలకు స్వాతంత్ర్య ఉద్యమం నాటి పోరాటాలను గుర్తు చేసే విధంగా మోడీ కీలకమైన ప్రసంగం చేశారు.
ఆజాద్ హిందూ ఫౌజ్ దళపతి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా మోడీ చేసిన ప్రకటనను అందరూ ఆహ్వానిస్తున్నారు. నేతాజీ భారీ విగ్రహం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. ఇందుకుగాను నేతాజీ గ్రానైట్ విగ్రహం తయారీ ప్రారంభించనున్నారు. ఇకపోతే అప్పటి వరకు హోలోగ్రామ్ పెట్టారు. దానిపైన 3 డీ చిత్రాన్ని ఆవిష్కరించారు. మొత్తంగా మోడీ చేసిన ఈ ప్రకటన ద్వారా రాజకీయంగా లాభం జరుగుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. దేశభక్తిని పెంపొందించడం ద్వారా భారత జాతిలో ఐక్యత వస్తుందని ఈ సందర్భంగా పలువురు చెప్తున్నారు.
Also Read: ట్రెండింగ్: అంతుచిక్కని సమంత వ్యవహారం..
ఇకపోతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఈ నెల 23 నుంచ గణతంత్ర దినోత్సవ వేడుకలను స్టార్ట్ చేయాలని ప్రధాని నిర్ణయించారు. అలా చేయడం ద్వారా నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహానేతలను గత ప్రభుత్వాలు గుర్తించలేకపోయాయని మోడీ చెప్పకనే చెప్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని కొందరు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహా నేతకు మోడీ కృతజ్ఞతతో కూడిన నివాళి ఇవ్వడం మంచి విషయమేనని కొందరు పేర్కొంటున్నారు. ఢిల్లీలో నేతాజీకి భారీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆహ్వానించారు.
భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచే విధంగా నేతాజీ విగ్రహం ఏర్పాటు చేయబోతున్నట్లు మోడీ తెలిపారు. ఇకపోతే నేతాజీ ధైర్య సాహసాల గురించి అత్యద్భుతంగా ప్రధాని వివరించారు. స్వాతంత్ర్యం కోసం నేతాజీ పోరాడిన విధానం గురించి తెలిపారు. స్వాతంత్ర్యం అడుక్కోకూడదని, దానిని సాధించుకోవాలని చెప్పిన వీరుడు నేతాజీ అని గుర్తు చేశారు. మోడీ ట్విట్టర్ వేదికగానూ ట్వీట్ చేసి నేతాజీకి నివాళి అర్పించారు.
Also Read:చాణక్య నీతి ప్రకారం జీవితం లో కష్టాలు ఉండకూడదంటే ఇవి పాటించాలి .!