Ambati Rambabu: అంబటి ఏది చేసినా అతి!

అంబటి రాంబాబు వైసీపీ గురించి అందరూ మాట్లాడుకోవాలని భావించారు.అందుకు ఏంచేయాలా అని ఆలోచన చేశారు. టీ గ్లాసులపై తనతో పాటు జగన్ బొమ్మను వేశారు.

Written By: Dharma, Updated On : April 18, 2024 12:04 pm

Ambati Rambabu

Follow us on

Ambati Rambabu: కొందరు ఆలోచనలు శృతిమించుతుంటాయి. ఒక్కోసారి వికటిస్తాయి కూడా. ఏదో ఊహించి చేస్తే.. దాని ఫలితం మరోలా వస్తుంటుంది కూడా.ఇప్పుడు మంత్రి అంబటి రాంబాబు ఇటువంటి ప్రయత్నం చేసి ప్రజల్లో నవ్వుల పాలయ్యారు. తాను మాత్రమే కాదు, పార్టీని, పార్టీ అధినేతను సైతం వీధిన పడేశారు. అందరూ నవ్వుకునేలా చేశారు. దీంతో వైసీపీ శ్రేణులే అంబటి రాంబాబు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకీ ఆయన చేసిన పని ఏంటంటే.. ఫ్యాన్ గుర్తు, రంగులతో కూడిన టీ గ్లాసులను నియోజకవర్గ వ్యాప్తంగా పంచడం.. టీ తాగిన తర్వాత అవి చెత్తబుట్టలోకి వెళ్లడం.. ఎక్కడికక్కడే చెత్త కుప్పల్లో కనిపించడంతో.. సరైన ట్రీట్మెంట్ ఇచ్చారని ప్రజలు సెటైర్లు వేసుకోవడం వరకు వచ్చింది పరిస్థితి.

అంబటి రాంబాబు వైసీపీ గురించి అందరూ మాట్లాడుకోవాలని భావించారు.అందుకు ఏంచేయాలా అని ఆలోచన చేశారు. టీ గ్లాసులపై తనతో పాటు జగన్ బొమ్మను వేశారు. పార్టీ రంగును అతికించారు. కనీసం ఎవరిని సంప్రదించకుండా సత్తెనపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి టీ దుకాణానికి పనిచేశారు. ఏదో ఘనకార్యంగా తనకు తాను జబ్బలు చరుచుకున్నారు. అటు టీ దుకాణదారులు సైతం తమకు ఖర్చు తగ్గిందని భావించారు. అంబటి ఇలా పంపించగానే ఆ గ్లాసులను వాడేసారు. చెత్తబుట్టలో పడేశారు. దీంతో సత్తెనపల్లి వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ టీ గ్లాసులు కనిపిస్తున్నాయి.చెత్తలో కనిపించడంతో వైసీపీ అభిమానులు దీనిని అవమానంగా భావిస్తున్నారు.

ఎన్నికల షెడ్యూల్ రాకమునుపే అంబటి రాంబాబు ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా ఇస్త్రీ చేశారు, దోసెలు వేశారు, టిఫిన్ వడ్డిస్తున్నారు.. ఇలా ఒకటేమిటి ఎన్నో రకాలుగా ప్రయోగాలు చేస్తున్నారు. ప్రజలు కూడా భారంగానే ఆయనను భరిస్తున్నారు. అయితే ఈ టీ గ్లాస్ ఆలోచన మాత్రం అంబటికి రావడంఆశ్చర్యం వేస్తోంది. వాస్తవానికి తదుపరి పరిణామాలు ఊహించలేకపోయారు అంబటి రాంబాబు. ఈ టీ గ్లాసులు చెత్త కుప్పల్లో దర్శనమిస్తున్నాయి. ఆ ఫోటోలతో కూడిన గ్లాసులపైనే కుక్కలు, మనుషులు చేయకూడని పనులు చేస్తున్నారు. ఏదో చేద్దాం అనుకుంటే ఏదేదో అయిపోతుందని వైసీపీ నేతల సైతం బాధపడుతున్నారు. ఇది చాలదన్నట్టు.. ఎన్నికల కోడ్ను అతిక్రమించి టీ గ్లాసులను పంచడంపై టిడిపి సీరియస్ గా ఉంది. ఈసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతోంది.