Vakula Silks in Hyderabad: ఏదైనా వ్యాపారం సక్సెస్ కావాలంటే పబ్లిసిటీ ( publicity) అవసరం. కొన్ని రకాల వ్యాపారాలకు అదే కీలకం. అయితే సోషల్ మీడియా వచ్చాక వ్యాపార పబ్లిసిటీ పతాక స్థాయికి పెరిగింది. ఎవరికి వారే తమ వ్యాపార ప్రకటనలను, ప్రచారాలను చేసుకుంటున్నారు. ‘డబ్బులు ఊరికే రావు’ అంటూ వైభవ్ జ్యువెలర్స్ అధినేత ఎంత ఫేమస్ అయ్యారు అందరికీ తెలిసిందే. అంతకుమించి తన వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా పెంచుకున్నారు. ఇప్పుడు దివ్వెల మాధురి అదే ఫార్ములా తో ముందుకు వెళ్తోంది. హైదరాబాదులో తన సహచరుడు దువ్వాడ శ్రీనివాస్ తో కలిపి వ్యాపార రంగంలో అడుగు పెట్టింది. టెక్స్టైల్స్ రంగంలో అడుగుపెట్టిన ఈ జంట ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం హల్చల్ చేస్తోంది. తాజాగా కాంచీపురం వకుల సిల్క్స్ పేరిట హైదరాబాదులో వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన మాధురి ఏకంగా అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో కలిసి రీల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Duvvada Srinivas: వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్ కు కారణం అదేనా!
సెలబ్రెటీస్ జాబితాలో..
తెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas ), దివ్వెల మాధురి ఎంతో ఫేమస్. పొలిటికల్ కెరీర్ నుంచి వచ్చిన ఈ జంట తర్వాత సెలబ్రిటీ హోదాలోకి మారిపోయింది. దువ్వాడ శ్రీనివాస్ జీవితంలోకి మాధురి రాగా.. ఆ కుటుంబంలో పెను దుమారం దారితీసింది. రచ్చ రచ్చ సాగింది. ఆ రచ్చతోనే ఈ జంట మరింత ఫేమస్ అయింది. దీనికి అన్ని రకాల మీడియా మరింత దోహద పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ జంట మరింత ఫేమస్ అయ్యింది. అయితే ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ పై వేటు వేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ప్రస్తుతం ఈ జంట వస్త్ర వ్యాపారంలో అడుగుపెట్టింది. హైదరాబాదులో కాంచీపురం వకుల సిల్క్ పేరిట భారీ వస్త్ర దుకాణాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తన వ్యాపారాన్ని విస్తృతం చేసే క్రమంలో దివ్వెల మాధురి సోషల్ మీడియా వేదికగా రీల్స్ చేస్తున్నారు. అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Also Read: Duvvada Srinivas: మాధురి పోస్టింగ్.. దువ్వాడ ఊస్టింగ్!
దుకాణం సిబ్బందితో కలిసి..
సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యారు దివ్వెల మాధురి( Divvela Madhuri) . స్వతహాగా ఆమె డాన్స్ మాస్టర్. ఎంతోమంది చిన్నారులకు, మహిళలకు డాన్స్ నేర్పించారు ఆమె. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సొంత యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఆమె దువ్వాడ శ్రీనివాస్ తో చేసిన రీల్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ జంటకు ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉన్నారు. మొన్న ఆ మధ్యన కుటుంబ ఫంక్షన్ లో డాన్స్ చేసి హల్చల్ చేసింది ఈ జంట. అయితే తాజాగా దివ్వల మాధురి తన వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న సిబ్బందితో రీల్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. వ్యాపారంలో ఖాతాదారులను ఆకట్టుకునే విధంగా వారికి స్వాగతం పలుకుతూ.. సాగిన ఈ రీల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
దువ్వెన పిలుస్తుంది నే పోతా,
అదే షాపింగ్ కి pic.twitter.com/CV5T1xGSlR— Rambabu pasumarthi (@pasumarthi66) June 23, 2025