Donald Trump: ఇరాన్, ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ డీల్ తర్వాత ట్రంప్ తొలిసారి స్పందించారు. రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ దాడి చేస్తే తీవ్రంగా ప్రతి స్పందించాలంటూ ఆర్మ్ డ్ ఫోర్సెోస్ కు ఇజ్రాయెల్ ఢిఫెన్స్ మినిస్టర్ ఆదేశాలివ్వడంపై ట్రంప్ ఫైరయ్యారు. ఇరాన్ పై అటాక్ చేయొద్దని, యుద్ధ విమానాలను వెనక్కి రప్పించాలని ఇజ్రాయెల్ కు సూచించారు.