Lalithambigai Temple: ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో భక్తితో దేవుళ్లను పూజించే వాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అధ్యాత్మికతకు మన దేశం నెలవు అనే సంగతి తెలిసిందే. దేవుళ్లతో పాటు దేవతలను సైతం మన దేశంలో వివిధ రూపాలలో పూజించడం జరుగుతుంది. మన దేశంలో భక్తులు కోరుకున్న కోరికలను తీర్చే ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రాలలో తమిళనాడు రాష్ట్రంలోని తిరువరూర్ జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రం కూడా ఒకటి.

ఈ ఆలయం పేరు మేఘనాథస్వామి లలితాంబిక ఆలయం కాగా ఈ ఆలయంలో లలితా పారాయణ స్తోత్రాన్ని పఠించడం భక్తుల కోరికలు తీరతాయి. ఈ ఆలయానికి అమ్మవారికి శాంతపరిచిన మహాదేవుని ఆలయంగా కూడా పేరు ఉండటం గమనార్హం. ఈ ఆలయంలో శివుడు మేఘనాథస్వామిగా పార్వతి లలితాంబికగా ఆవిర్భవించారు. జగన్మాత పాండాసురుడు అనే రాక్షసుడిని సంహరించడం కొరకు శ్రీచక్ర రథంపై ఆసీనురలై పాండాసురుడిని సంహరించారు.
ఆ తర్వాత ఆగ్రహంతో ఉన్న లలితాంబిక శివుని ఆదేశాల మేరకు ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేశారు. భార్యాభర్తలు ఈ ఆలయాన్ని నేతిలో దర్శించుకుంటే జీవితాంతం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉండదు. ఈ ఆలయంలో 60, 80వ పుట్టినరోజులను జరుపుకుంటే మంచిది. ఏప్రిల్ మే నెలల్లో ఈ ఆలయంలో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయి.
ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటే జీవితాంతం ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. ఈ ఆలయంలో ప్రసాదం తీసుకోవడం ద్వారా రోగాలు తగ్గుతాయని భక్తులు నమ్ముతారు. తిరువరూర్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉండగా పేరళం రైల్వేస్టేషన్ నుంచి ఈ ఆలయానికి చేరుకోవచ్చు.