Bigg Boss 5 Telugu: సాధారణ ఎపిసోడ్‌లు చూసి విసిగిపోయినట్టు ఉన్నారు బిగ్ బాస్ ప్రేక్షకులు. అందుకే గేరు మార్చి లవ్ ట్రాక్ గేరుని మొదలుపెట్టాడు. షో ప్రారంభంలో హోస్ట్ అక్కినేని నాగార్జున వాగ్దానం చేసినట్లుగానే సీజన్ 5 లో 5మచ్ ఎంటర్టర్టైన్మెంట్ మాములుగా లేదు. అంతా బాగానే ఉంది కానీ అసలు సిసలైన లవ్ ట్రాక్ మాత్రం ఇంకా బిగ్ బాస్ లో స్టార్ట్ అవ్వలేదు. అయితే, చివరకు, బిగ్ బాస్ హౌస్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లవ్ ట్రాక్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

రొమాన్స్ షోలో చాలా ఉన్నందున బిగ్ బాస్ ప్రేక్షకులకి ఇప్పుడు బోర్‌గా అనిపించదు. బిగ్ బాస్ హౌస్ ఇద్దరు కంటెస్టెంట్ల మధ్య ప్రేమ చిగురించినట్లు కనిపిస్తుంది. శ్రీరామ చంద్ర, హమీదాల మధ్య స్నేహం నెమ్మదిగా లవ్ ట్రాక్‌గా మారుతున్నట్లు కనిపిస్తోంది. శ్రీరామ చంద్ర, హమీదా ఎల్లప్పుడూ కలిసి కనిపిస్తూ చెట్టా పట్టాలేసుకుని తిరుగుతూనే ఉంటున్నారు. దీనిబట్టి చూస్తే . వాళ్ళిద్దరి మధ్య జరిగే రాత్రి పూట సంభాషణలు చూస్తుంటే ఒకరిపై ఒకరు ఆసక్తి కలిగి ఉందని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా శ్రీరామచంద్ర, హమీదాను ముద్దాడుతున్న ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మొదటి ఎపిసోడ్ నుండి బిగ్ బాస్ వాళ్ళిద్దరి మధ్య సంబంధాన్ని జోడిగా చిత్రీకరించడానికి యత్నిస్తూనే ఉన్నాడు. ఒక ఎపిసోడ్‌లో, హౌస్ మేట్స్ శ్రీరామచంద్ర ని ఎవరితో డేట్‌కు వెళ్లాలనుకుంటున్నారని అడిగగా… శ్రీరామ్ హమీదాను ఒక డేట్ కి తీసుకెళ్తానని చెప్పాడు.
అయితే, నామినేషన్ల ప్రకారం, ఐదో వారంలో ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన పోటీదారులలో హమీదా ఒకరు. కొన్ని సామాజిక మాధ్యమాల్లో నిర్వహించిన ఓటింగ్ పోల్స్ లో హమీదా వెనుకబడి ఉన్నట్లు తెలుస్తుంది. దీన్ని బట్టిచూస్తే హమీదా డేంజర్ జోన్ రేసులో ముందెత్తు స్థానంలో ఉందన్నమాట. ఇప్పుడు, హమీదా, శ్రీరామ చంద్రల మధ్య కొత్త లవ్ ట్రాక్ ని నడిపించేందుకు బిగ్ బాస్ యత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా బిగ్ బాస్ టిఆర్‌పిల కోసం హమీదా స్థానంలో జెస్సీని తొలగించే అవకాశం ఉందని అంచనా కూడా వేస్తున్నారు. మరి ఐదో వారం ఎలిమినేషన్ కోసం బిగ్ బాస్ మేకర్స్ ఏమ్ ప్లాన్ చేస్తున్నారో వేచి చూద్దాం.