Home : ప్రపంచాన్ని చుట్టేయాలని ఎంతోమంది ఎన్నో కలలు కంటూ ఉంటారు. కానీ కొందరికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. నేటి కాలంలో కొందరు బ్లాక్ పేరిట ప్రపంచాన్ని చుట్టివస్తున్నారు. దేశ విదేశాలు తిరుగుతూ తమ కాలను నెరవేర్చుకుంటున్నారు. అయితే కొందరు సరదా కోసం విదేశాల్లో కు వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉండాలని చూస్తారు. మరికొందరు అడవులకు వెళ్లి కాసేపు ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. అయితే అనుకున్న సమయానికి అనుకున్న పనులు కాలేవు. కానీ అక్కడే ఉన్నట్లు ఎక్స్పీరియన్స్ మాత్రం పొందవచ్చు. అలా ఎక్స్పీరియన్స్ పొందడానికి చిన్న trik ప్లే చేస్తే చాలు.. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Also Read : ఇంట్లో మొక్కలను పెంచుతున్నారా? వీటిని తప్పకుండా ఉంచండి..
కాలానుగుణంగా టెక్నాలజీ కొత్త పుంతలు తప్పుతోంది. ప్రతి రంగం టెక్నాలజీ పైన ఆధారపడుతుంది. అయితే టెక్నాలజీ కేవలం పనులు నిర్వహించడానికి మాత్రమే కాకుండా సరదాకు కూడా ఉపయోగపడుతుంది. టెక్నాలజీ సహాయంతోనే ఇంట్లోనే ఉండి ప్రపంచాన్ని చుట్టి వచ్చే మార్గాలను వస్తున్నాయి. తాజాగా గూగుల్లో ఒక వెబ్సైట్ ద్వారా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి అక్కడే ఉన్నట్లు అనుభూతిని పొందవచ్చు. మీరు కోరుకున్న చోటా నడవొచ్చు.. లేదా ఫ్లైట్లో నుంచి నగరాన్ని చూడవచ్చు.. ఇంకా ఏదంటే అదే చేయడానికి ఒక వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది..
ఇంట్లో కూర్చొని ప్రపంచాన్ని చూడమంటే ఎవరైనా నమ్మరు. కానీ Google లోకి వెళ్లి Virtual Vacation అని టైప్ చేయాలి. ఇందులో మొదటి వెబ్సైట్ను ఓపెన్ చేయగా.. కొన్ని ఆప్షన్లు అందుబాటులో కనిపిస్తాయి. ఇందులో Walking అనే ఆప్షన్ పై క్లిక్ చేయగా.. కొన్ని నగరాల పేర్లు వస్తాయి. అంటే మీరు ఏ నగరంలో నైతే నడవాలని అనుకుంటున్నారో.. ఆ నగరానికి వెళ్లి నడిచే అనుభూతిని పొందుతారు. ఉదాహరణకు బెర్లిన్ అనే నగరంపై క్లిక్ చేయగా.. ప్రస్తుతం బెర్లిన్ లోనే నడుస్తున్నట్లు అనుభూతిని పొందుతారు..
అలాగే ఫ్లైట్ ఎక్కాలని చాలామంది కలలు కంటారు.. కొందరు ఫ్లైట్ ఎక్కి విదేశాలకు వెళ్లాలని చూస్తారు. లైట్లో నుంచి భూమిపై ఉండే భవనాలను చూస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. అలాంటి అనుభూతిని ఫ్లైట్ ఎక్కితే కానీ రాదు. కానీ ఇదే virtual vacation ద్వారా ఫ్లైట్ ఎక్కిన అనుభూతి కలుగుతుంది. ఫ్లైట్ ఎక్కి అందులో ప్రయాణించినట్లు అనుభూతి పొందుతారు. ఉదాహరణకు దుబాయ్ కి ఫ్లైట్లో వెళ్లి పైనుంచి దుబాయిలోని పెద్ద పెద్ద భవనాలను చూడాలని అనుకున్నప్పుడు Flight అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు కొన్ని నగరాలను సూచిస్తుంది. వీటిలో దుబాయి నగరాన్ని క్లిక్ చేయగానే దుబాయిలో ఫ్లైట్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది..
ఇవే కాకుండా ఇంకా ఏ రకంగా నైతే అనుభూతి పొందాలని అనుకుంటున్నారో అలాంటి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. కారులో ప్రయాణం చేసేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి driving tour, ఒక ప్రదేశంలో ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి Live Cam వంటి ఆప్షన్ కూడా ఉన్నాయి. ఖాళీ సమయాల్లో సరదా తీర్చుకోవడానికి ఈ వెబ్సైట్ ఎంతో ఉపయోగకరంగా ఉంది.
Also Read : ఇంట్లోనే ఇలా గోల్డెన్ ఫేషియల్ వేసుకోండి.