Home : మీరు పార్లర్ చుట్టూ తిరిగి తిరిగి డబ్బులు వృధా చేసుకున్నారా? అయినా సరే ఫలితం జీరో కదా. ఎన్నో టిప్స్ పాటించినా సరే మంచి ఫలితాలు రాకపోవడంతో బాధ పడుతుంటారు చాలా మంది. ఖరీదైన పౌడర్లు, క్రీములు వాడుతుంటారు కొందరు. కొందరికి ఫేస్ మీద చాలా మచ్చలు ఉంటాయి. మరికొందరు నల్లగా ఉంటారు. కొందరు ఛామన్ ఛాయ కలర్ లో ఉంటారు. కొందరు తెల్లగా ఉన్నా సరే పేలిపోయినట్టు ఉంటారు. మొటిమలు, పగుళ్లు, మచ్చలు ఇలా చాలా సమస్యలతో బాధపడేవారు ఎక్కువ ఉంటారు. ఈ సమస్యల నుంచి బయటపడటానికి ఎన్నో దారులు ఎంచుకుంటారు. కానీ వాటి ఫలితం శూన్యం అవడంతో ఏం చేయాలో తోచదు. అందుకే ఎక్కువగా ఆలోచించకుండా ఇంట్లోనే ఈ టిప్స్ ను పాటించండి.
పార్లర్‌కి వెళ్లడానికి సమయం దొరకడం అందరికీ సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో, ఇంట్లోనే సులభమైన, సమర్థవంతమైన గోల్డెన్ ఫేషియల్ చేసుకోవడం ఉత్తమ మార్గం. ఇది మీ చర్మం మెరిసేలా చేయడమే కాకుండా మీ డబ్బు, సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. ఇంట్లో ఉంచే వస్తువులతో గోల్డెన్ ఫేషియల్ ఎలా చేసుకోవాలో, ఇప్పుడు తెలుసుకుందాం…
ఫేషియల్ మొదటి దశ లో ముందుగా చర్మాన్ని శుభ్రపరుచుకోవాలి. జిడ్డుగా ఉంటే దాని మీదనే మీరు ప్రయత్నించవద్దు. ముందుగా మీ ఫేస్ ను వాష్ చేసుకోండి. దీని కోసం, ఒక చెంచా పచ్చి పాలలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలపండి. కాటన్ సహాయంతో మీ ముఖం, మెడపై అప్లై చేసి, సున్నితమైన చేతులతో శుభ్రం చేసుకోండి.
స్క్రబ్బింగ్
పసుపు, చక్కెర మిశ్రమం సహజ స్క్రబ్‌గా పనిచేస్తుంది. ఒక టీ స్పూన్ పసుపు లో అర టీ స్పూన్ పంచదార కలపి, వృత్తాకారంలో మసాజ్ చేసుకోండి.
మసాజ్
ఒక టీస్పూన్ అలోవెరా జెల్‌లో అర టీస్పూన్ తేనె కలపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 5-10 నిమిషాల పాటు వృత్తాకారంలో మసాజ్ చేయాలి.
ఫేస్ ప్యాక్
ఒక చెంచా పసుపు, రెండు చెంచాల శెనగపిండి, కొద్దిగా పచ్చి పాలు వేసి చిక్కని పేస్ట్‌లా తయారు చేసుకోండి. దీన్ని మీ ముఖం, మెడపై అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోండి.
టోనింగ్
ఫేషియల్ చివరి దశలో రోజ్ వాటర్ ఉపయోగించండి. స్ప్రే బాటిల్‌లో రోజ్ వాటర్ నింపి మీ ముఖంపై స్ప్రే చేయండి. దానిని మెత్తగా పాట్ చేసి, చర్మంలోకి చొచ్చుకుపోయేలా చేయండి.
ఈ ఫేషియల్ మీ చర్మాన్ని కాంతివంతం చేయడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. ఇలా నెలకు 1-2 సార్లు చేస్తే చర్మానికి మేలు జరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే దీని కోసం మీరు ఖరీదైన ఉత్పత్తులు లేదా పార్లర్లపై డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో లభించే సహజ సిద్ధమైన వస్తువులతోనే మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు.