https://oktelugu.com/

Toxic Friends: టాక్సిక్ ఫ్రెండ్స్ నుంచి బయట పడటం ఎలా?

టాక్సిక్ ఫ్రెండ్స్ ఏదో ఒక మాట అంటూ మిమ్మల్ని బాధపెట్టడం, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం వంటివి చేస్తారు. ఇలాంటి మాటల వల్ల రోజూ మీరు బాధపడాల్సి వస్తుంది. మరి ఇలాంటి ఫ్రెండ్‌షిప్ నుంచి బయటపడటం ఎలాగో మరి చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 12, 2024 / 04:03 PM IST

    Toxic friends

    Follow us on

    Toxic Friends: ఈ ప్రపంచంలో స్నేహ బంధం చాలా ముఖ్యమైనది. కానీ కొందరు స్నేహితుల పరువు తీస్తున్నారు. పైకి ప్రేమగా వెన్న పూసినట్లు మాట్లాడతారు. కానీ మనసులో మాత్రం చాలా పగ ఉంటుంది. నిత్యం మీ మంచి కంటే చెడునే ఎక్కువగా కోరుకుంటారు. మన దగ్గర మంచిగానే మాట్లాడుతారు. ఇతరుల దగ్గరకు వెళ్లి మన గురించి బ్యాడ్‌గా చెబుతుంటారు. ఇలాంటి టాక్సిక్ పీపుల్స్‌తో ఫ్రెండ్‌‌షిప్ చేయడం కంటే ఒంటరిగా ఉండటం మేలు. అయితే కొందరికి ఫ్రెండ్ టాక్సిక్ లేదా మంచివారా అనే విషయం తెలియదు. వీరిని గుర్తు పట్టడం కూడా కాస్త కష్టమే. ఎందుకంటే మాస్క్ వేసుకుని ఉంటారు కాబట్టి. ఇలాంటి టాక్సిక్స్ ఫ్రెండ్‌షిప్‌లో ఉంటే సమస్యలు వస్తాయో రావో పక్కన పెడితే ముందు ప్రశాంతంగా ఉండలేరు. మీరు అంటే ఇష్టం లేని వారు ప్రతీ విషయంలో మిమ్మల్ని పాయింట్ చేస్తారు. ఏదో ఒక మాట అంటూ మిమ్మల్ని బాధపెట్టడం, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం వంటివి చేస్తారు. ఇలాంటి మాటల వల్ల రోజూ మీరు బాధపడాల్సి వస్తుంది. మరి ఇలాంటి ఫ్రెండ్‌షిప్ నుంచి బయటపడటం ఎలాగో మరి చూద్దాం.

    టాక్సిక్ పీపుల్స్ దూరంగా ఉండండి
    మీ గురించి ఎవరైతే వ్యతిరేకంగా మాటలు చెప్పుతారో వారికి దూరంగా ఉండండి. వారు మీతో క్లోజ్‌గా ఉండటానికి ప్రయత్నించిన కూడా మొహమాటం లేకుండా చెప్పేయండి. మీ పద్ధతి బాలేదని, దూరంగా ఉంటామని చెప్పండి. కొత్తలో కాస్త బాధ అనిపించిన చివరకు అలవాటు అవుతుంది. అదే రోజూ వాళ్లతో ఉంటే ఇంకా ఎక్కువ మాటలు పడాల్సి వస్తుంది. ఇలాంటి ఫ్రెండ్స్‌కి దూరంగా ఉంటేనే మానసికంగా సంతోషంగా ఉంటారు. లేకపోతే ఇలాంటి మాటలకి ఎక్కువగా ఒత్తిడికి గురై మానసిక ఆవేదన చెందుతారు.

    భావాలను వ్యక్తపరచాలి
    పైకి తీయని మాటలు.. లోపల విషపూరితంతో ఉంటున్న స్నేహితులతో ఎండ్ చేయడం మంచిది. వారు చేసిన పనులను అన్నింటిని కూడా వివరంగా వారికి తెలియజేయండి. ఫీల్ అవుతారు ఏమో అని కాకుండా ఓపెన్‌గా మీ భావాలు వ్యక్తపరచండి. దీనివల్ల వారికి బుద్ధి చెప్పిన వారు అవుతారు. ఇప్పటికీ వాళ్లు మారకపోతే జీవితంలో ఇంకా మారరని వదిలేయాలి.

    బయటకు పిలిస్తే వెళ్లవద్దు
    మీతో నటంచే స్నేహితులు మిమ్మల్ని ఎక్కడికైనా బయటకు పిలిచినప్పుడు అసలు వెళ్లవద్దు. పిలిచిన వెంటనే నో చెప్పడం అలవాటు చేసుకోండి. వారితో రిలేషన్ పూర్తిగా వదిలేయాలి. ఇలా వాళ్లతో అన్నింటికి రానని చెబితే వాళ్లకి మీరు చెప్పకపోయిన కనీసం అర్థం అవుతుంది.

    అభిమానించే వారితో ఉండండి
    మీరు ఎవరితో ఉంటే సంతోషంగా ఉంటారో.. వాళ్లతో ఉండండి. మీ చుట్టూ ఉన్నవారిలో టాక్సిక్ ఎవరో, మంచి వారు ఎవరో తెలుసుకోండి. మీకు మంచి చేసే వారితోని మాత్రమే ఉండండి. వారితో సమయం గడపడం వల్ల మీరు వారి నుంచి ఏవైనా విషయాలు తెలుసుకుంటారు. బాధపడే అవసరం లేకుండా సంతోషంగా ఉంటారు. కాబట్టి మీరు స్నేహం చేసే ముందు కూడా కాస్త తెలుసుకుని చేయండి. దీనివల్ల తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు.

    ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవద్దు
    మీ విషయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి. టాక్సిక్ స్నేహితులకు ప్రాధాన్యత ఇచ్చి మళ్లీ బాధపడవద్దు. కాబట్టి ఎప్పుడైనా మీకు మీరే ముందు. తర్వాతే ఎవరైనా అని తెలుసుకోండి.