Adams Bridge: రామసేతు బ్రిడ్జ్ నిజమేనా? సముద్ర గర్భం లోపల ఉందా?

లంకకి, భారతదేశానికి మధ్యలో ఆడమ్స్ బ్రిడ్జ్ ఉండేదని చెప్పుకునేవారు. దీనినే రామసేతు లేదా రాముడి వంతెన అని కూడా అంటారు. అలాగే దీనిని పాంబన్ ద్వీపం లేదా రామేశ్వరం దీపం అని కూడా అంటారు.

Written By: Kusuma Aggunna, Updated On : October 12, 2024 2:37 pm

rama shetu

Follow us on

Adams Bridge: భారత్, శ్రీలంక దేశాలు సన్నిహితంగానే ఉంటాయి. భారత్ కంటే ఎంతో చిన్న దేశమైన శ్రీలంకలో చూడటానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చారిత్రాత్మకంగా చెప్పుకోవడానికి కూడా ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే శ్రీలంకకి, భారతదేశానికి మధ్యలో ఆడమ్స్ బ్రిడ్జ్ ఉండేదని చెప్పుకునేవారు. దీనినే రామసేతు లేదా రాముడి వంతెన అని కూడా అంటారు. అలాగే దీనిని పాంబన్ ద్వీపం లేదా రామేశ్వరం దీపం అని కూడా అంటారు. అయితే ఈ రామసేతు బ్రిడ్జ్‌పై రెండేళ్ల కిందట ఓ సినిమా కూడా వచ్చింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించారు. దేశానికి ఆగ్నేయ, వాయువ్య తీరంలో మన్నార్ ద్వీపం మధ్యలో సున్నపురాయి గొలుసులో ఉన్నదే ఈ రామసేతు బ్రిడ్జ్.

 

ఈ బ్రిడ్జ్ రాముడు నిర్మించాడని కొందరు భావిస్తారు. కానీ ఇది రాముడు నిర్మించిన బ్రిడ్జ్ కాదని అంటుంటారు. ఈ వివాదంపైనే రామసేతు సినిమా కూడా వచ్చింది. ఈ బ్రిడ్జ్‌తో శ్రీలంక, భారతదేశం మధ్య రాకపోకలు ఉండేవని చెప్పుకునేవారు. గల్ఫ్ ఆఫ్ మన్నార్‌ను పాక్ జలసంధిని ఈ బ్రిడ్జ్ వేరు చేస్తుంది. ఈ ప్రాంతంలో సముద్రం చాలా లోతుగా ఉంటుందట. 15వ శతాబ్దం వరకు కాలినడకన భారత్, శ్రీలంక రాకపోకలు సాగించేవారట. రానురాను ఈ బ్రిడ్జ్ సముద్రంతో మూసుకుపోయింది. అప్పట్లో తుపాను కారణంగా ఈ ఆడమ్స్ బ్రిడ్జ్ మొత్తం పూర్తిగా ధ్వంసం అయ్యి.. సముద్ర మట్టం పైకి వచ్చిందని చెప్పుకుంటారు. అయితే ఈ బ్రిడ్జ్ మానవ నిర్మితమా? రాముడి నిర్మించిందా? సముద్రంలో ఇప్పటికీ ఉందా? లేదనే విషయాలు సందేహమే. కానీ 2018లో ల్యాండ్‌శాట్ కొన్ని చిత్రాలను విడుదల చేసింది ఇందులో ఆడమ్స్ బ్రిడ్జ్ ఉందనే అవశేషాలు కనిపించాయి.

 

15వ శతాబ్దం వరకు రెండు దేశాల మధ్య సులభంగా రాకపోకలు ఉండేవి. ఈ వంతెన ద్వారా వెళ్లి రావడం చాలా ఈజీగా ఉండేది. కానీ తుపాను కారణంగా వంతెన ధ్వంసం కావడంతో మూతపడింది. ఆ ప్రదేశంలో నౌకలు కూడా ప్రయాణించలేవు. ఎందుకంటే ఇక్కడ సముద్ర గర్భం చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల నౌకలు వెళ్లడానికి భయపడతాయి. ఈ బ్రిడ్జ్ ప్రస్తుతం 99.8 శాతం సముద్రంలో మునిగి ఉందట. అయితే రెండు దేశాల మధ్య వంతెన నిర్మించాలని రెండు ప్రభుత్వాలు ప్లాన్ చేస్తున్నాయి. భారత్‌లోని ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్‌ను కలుపుతూ వంతెన నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నిస్తోంది. సముద్రంపై 23 కిలోమీటర్ల పొడవున ఈ వంతెన నిర్మించాలని చూస్తున్నారు. దీనికి రెండు దేశాలు కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నాయి. మొత్తం రూ.40 కోట్లు ఖర్చు పెట్టి ఈ నిర్మాణం చేయనుంది. ఇప్పటికే ముంబాయిలో సముద్రంపై బ్రిడ్జ్‌ను నిర్మించగా వాహనరాకపోకలు సాగుతున్నాయి. అలాగే శ్రీలంక, భారత్ మధ్య బ్రిడ్జ్ పూర్తి అయితే రెండు దేశాల మధ్య రవాణాకి కొత్త పీట వేసినట్లే. రెండు దేశాల పర్యాటక రంగం కూడా ఇంకా అభివృద్ధి చెందుతుందనే చెప్పవచ్చు.