Diabetic: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీకు మధుమేహం ఉన్నట్లే!

ప్రస్తుతం చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే సరైన డైట్ పాటించాలి. లేకపోతే సమస్య తీవ్రం అవుతుంది. మరి మధుమేహం వచ్చే ముందు శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 12, 2024 4:14 pm

diabetic

Follow us on

Diabetic: ప్రస్తుతం చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే సరైన డైట్ పాటించాలి. లేకపోతే సమస్య తీవ్రం అవుతుంది. పెద్ద సమస్య కాదని కొందరు ఫీల్ అయిన కూడా షుగర్ ఉంటే ఇతర ఏ సమస్య వచ్చిన పెద్దగానే కనిపిస్తుంది. అయితే తినే ఆహారంలో చక్కెర మోతాదులు ఎక్కువగా ఉంటే తొందరగా మధుమేహం వస్తుంది. ఈ రోజుల్లో ఆహార విషయంలో నియమాలు పాటించకుండా, బయట ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం, సాఫ్ట్ డ్రింక్స్, మద్యపానం, ధూమపానం, ఆర్టిఫిషియల్ షుగర్ వంటివి తీసుకోవడం వల్ల చాలామంది మధుమేహంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్య వచ్చే ముందు కొందరికి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని బట్టి మధుమేహం వచ్చింది ఏమోనని సందేహ పడవచ్చట. దీనికి సరైన చికిత్స అంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ.. ఆహార నియమాలు పాటిస్తూ, మందులు వేసుకోవడమే మార్గం. మధుమేహం వచ్చిన వెంటనే గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే సమస్య నుంచి కాస్త విముక్తి పొందవచ్చు. మరి మధుమేహం వచ్చే ముందు శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పలుమార్లు మూత్ర విసర్జన చేయడం
డయాబెటిస్ వచ్చిందని అనడానికి మొదటి సంకేతం మూత్ర విసర్జన. ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లడం, రాత్రి సమయంలో ఎక్కువ సార్లు వెళ్తున్నట్లయితే డయాబెటిస్ వచ్చినట్లు సందేహపడవచ్చు. ఏదైనా పదార్థాలు తినడం వల్ల ఒక రెండు రోజులు వస్తే పర్లేదు. కానీ రోజూ కూడా ఇలాగే ఎక్కువ సార్లు మూత్ర విసర్జన అవుతున్నట్లయితే తప్పకుండా జాగ్రత్త పడండి.

ఎక్కువగా దాహం వేయడం
ఎక్కువగా నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదే. కానీ ఎక్కువగా దాహం వేస్తుంటే మాత్రం మధుమేహం ఉన్నట్లు గుర్తించాలి. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల తరచుగా మూత్ర విసర్జనకి వెళ్తారు. కాబట్టి ఇలా ఎక్కువగా దాహం వేస్తుంటే మాత్రం కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిందే.

ఎక్కువగా ఆకలి వేయడం
ఎంత ఫుడ్ తిన్నా కూడా అధికంగా ఆకలి వేస్తుంటే ప్రీ డయాబెటిక్‌గా గుర్తించాలి. ఇలా ఎక్కువగా అనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి. ఎక్కువగా ఆకలి వేస్తుందని కొందరు బయట ఫుడ్ కూడా తినేస్తారు. దీనివల్ల లేనిపోని సమస్యలు ఎక్కువగా వస్తాయి.

అలసట
ఎంత హాయిగా నిద్రపోయిన కూడా అలసటగా అనిపిస్తే కాస్త అనుమానించాల్సిందే. ఏదైనా చిన్న పనిచేసిన అలసిపోవడం, మెట్లు ఎక్కిన అలసటగా ఉంటే మాత్రం డాక్టర్‌ను సంప్రదించండి. లేకపోతే సమస్య తీవ్రత పెరిగిపోయే ప్రమాదం ఉంది.

కంటి చూపులో సమస్యలు
వయస్సు పెరిగితే కంటి సమస్యలు పెరుగుతాయి. కాస్త చూపు కూడా తగ్గుతుంది. కానీ ప్రీడయాబెటిస్ ఉన్నవారికి తొందరగా కంటి చూపు తగ్గుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్త పడండి.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు గూగుల్ ఆధారంగా చెప్పడం జరిగింది.