Youth : ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా అలసటకు బానిస అవుతుంది. టీనేజ్ ఏజ్‌లో ఎంతో యాక్టివ్‌గా (Active) పనిచేయాల్సిన యువత (Youth) అసలు చేయడం లేదు. ఏ పని చేయాలన్నా కూడా చిరాకు అవుతున్నారు. ఎందుకు ఈ చిరాకు వస్తుంది. పోషకాలు లేని ఆహారం (Food) తీసుకోవడమా? లేకపోతే ఒత్తిడి, ఆందోళనకు చెందడమా? అసలు దీనికి గల కారణాలు ఏంటి? యువత ఈ అలసట నుంచి బయట పడటం ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం.
యువతలో అలసట రావడానికి ప్రధాన కారణం ఆధునిక జీవనశైలి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు సరైన సమయానికి నిద్రపోరు. దీనికి తోడు పోషకాలు లేని ఆహారం తీసుకోవడం, మానసిక ఒత్తిడి, బద్ధకం, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల చాలా మందికి అలసట వస్తుంది. సమయానికి సరిగ్గా నిద్రపోకుండా మొబైల్, ల్యాప్ టాప్స్ వంటి రోజంతా ఎక్కువగా చూస్తున్నారు. ఏ పని చేసినా కూడా దానికి ఒక నియమం ఉండాలి. అంటే డైలీ ఒకే సమయానికి లేవడం, నిద్రపోవడం వంటివి చేయాలి. లేకపోతే జీవ గడియారం మొత్తం మారిపోతుంది. ఇవే కాకుండా ఈ రోజుల్లో పోషకాలు ఉండే కంటే లేని ఆహారాన్ని ఎక్కువగా తింటారు. వీటివల్ల శరీరానికి బలం ఏర్పడటం లేదు. ఎందుకంటే ప్రాసెస్డ్ చేసిన ఫుడ్‌లో ఎక్కువగా ప్రొటీన్స్ ఉండవు. వీటి వల్ల శరీరానికి ఎలాంటి శక్తి లభించదు. అలాగే పూర్తిగా శారీరక వ్యాయామం కూడా ఉండటం లేదు. వర్క్ ఉండటం వల్ల గంటల సమయం కొద్దీ ఆఫీసుల్లో ఉంటున్నారు. ఇలా కదలకుండా వాటి ముందు కూర్చోవడం వల్ల బద్దకం పెరుగుతుంది. శరీరానికి వ్యాయామం లేకపోవడం వల్ల అలసట, నీరసం అనిపిస్తుంది. దీనికి ఒత్తిడి ఒకటి. చదువు, ఉద్యోగం ఇలా అన్నింట్లో రాణించాలనే ఆందోళన మానసిక అలసటకు గురిచేస్తుంది. శరీరానికి అప్పుడప్పుడైనా ఎండ తగలాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు ఉండవు. దీని వల్ల మీరు కాస్త యాక్టివ్‌గా తయారు అవుతారు.
మీరు బాడీకి ఎంత విశ్రాంతి ఇస్తున్నా కూడా ఎక్కువగా అలసటకు గురి అవుతుంటే మాత్రం ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించండి. కనీసం ఆరు నెలలు అయినా కూడా సమస్య తగ్గకపోతే మాత్రం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ అలసట వల్ల బరువు తగ్గుతారు. అలాగే జ్వరం, రాత్రిపూట శరీరం చెమటలు ఎక్కుతుంది. ఎంత నిద్రపోయినా సరిపడకపోవడం, అలసట, దిగులు, నిరాశ, నిస్పృహ, ఆందోళన, మూడ్ స్వింగ్స్ వంటి మార్పులు మీరు గమనిస్తే మాత్రం వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. అలాగే సరైన సమయానికి భోజనం, నిద్ర ఉండాలి. అలాగే నాలుగు గంటలకు ఒకసారి పండ్లు తీసుకోవాలి. వాటర్ కూడా బాడీకి సరిపడా తాగాలి. వీటివల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. రోజూ ఒక 15 నిమిషాలు అయిన నడక లేదా వ్యాయామం వంటివి చేయండి. మొబైల్స్ చూస్తూ సమయాన్ని వృథా చేసుకోకుండా రోజూ ఒకే సమయానికి నిద్రపోండి. యోగా, మెడిటేషన్ వంటివి చేస్తుండండి. ధ్యానం, ప్రాణాయామం వంటి పద్ధతులతో మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే ప్రమాదకరమైన రక్తహీనత, థైరాయిడ్, గుండె సమస్యలు వంటి బారిన పడే ప్రమాదం ఉంది. ఈ అలసట వల్ల రోగనిరోధక శక్తి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఏ విషయంపై ఇంట్రెస్ట్ పెట్టలేరు. మానసికంగా ఎంతో ఇబ్బంది పడతారు. సరిగ్గా ఆలోచించలేరు. ఏకాగ్రత పూర్తిగా తగ్గిపోతుంది. మానసికంగా ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. పనులు చేసుకోవడానికి కూడా చిరాకుగా ఉంటుంది. కాస్త ఒత్తిడిని కూడా తట్టుకోలేరు. కాబట్టి అసలు లైట్ తీసుకోవద్దు.