https://oktelugu.com/

Married Couple: జీవిత భాగస్వామితో జీవితాంతం సంతోషంగా ఉండాలా.. చెప్పకూడని అబద్ధాలు ఇవే!

Married Couple: మనలో చాలామంది జీవిత భాగస్వామితో సంతోషంగా జీవనం సాగించాలని భావిస్తారు. అయితే కొన్ని చిన్నచిన్న తప్పుల వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి. జీవిత భాగస్వామితో జీవితాంతం సంతోషంగా ఉండాలని భావించే వాళ్లు కొన్ని తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు. కొన్ని తప్పులు చేస్తే జీవితాంతం భాగస్వామి దృష్టిలో మనపై తప్పుడు అభిప్రాయం ఏర్పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కొంతమంది భాగస్వామితో తమకు ఉన్న చెడు అలవాట్లను మానేస్తామని చెబుతుంటారు. అలా ప్రామిస్ […]

Written By: , Updated On : February 12, 2022 / 04:04 PM IST
Follow us on

Married Couple: మనలో చాలామంది జీవిత భాగస్వామితో సంతోషంగా జీవనం సాగించాలని భావిస్తారు. అయితే కొన్ని చిన్నచిన్న తప్పుల వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి. జీవిత భాగస్వామితో జీవితాంతం సంతోషంగా ఉండాలని భావించే వాళ్లు కొన్ని తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు.

కొన్ని తప్పులు చేస్తే జీవితాంతం భాగస్వామి దృష్టిలో మనపై తప్పుడు అభిప్రాయం ఏర్పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

కొంతమంది భాగస్వామితో తమకు ఉన్న చెడు అలవాట్లను మానేస్తామని చెబుతుంటారు. అలా ప్రామిస్ చేసి ఆ అలవాటును మానకపోతే మాత్రం ఇబ్బంది పడక తప్పదు. కచ్చితంగా మానేస్తామని నమ్మకం కలగడంతో పాటు కొన్నిరోజులు చెడు అలవాట్లను మానేయడం కోసం ప్రయత్నం చేసి ఆ తర్వాత భాగస్వామికి ప్రామిస్ చేస్తే మంచిదని చెప్పవచ్చు. మరి కొందరు భాగస్వామిపై ఏ సందర్భంలో కోప్పడనని చెబుతుంటారు.

అయితే మాట ఇవ్వడం తేలికే అయినా నిజ జీవితంలో ఈ మాటను నిలబెట్టుకోవడం చాలా కష్టం. జీవిత భాగస్వామికి మీరు ఈ తరహా మాట ఇచ్చి ఎప్పుడైనా కోప్పడితే వెంటనే క్షమాపణలు చెబితే మంచిదని చెప్పవచ్చు. జీవిత భాగస్వామికి అబద్ధం చెప్పనని మాట ఇచ్చి అబద్ధం చెప్పినా చిక్కుల్లో పడే అవకాశాలు అయితే ఉంటాయి. మరీ అత్యవసరమైన కారణం ఉంటే తప్ప అబద్ధం చెప్పకూడదు.

జీవిత భాగస్వామిని బాధ పెట్టనని, వదిలిపెట్టనని మరి కొందరు ప్రామిస్ చేస్తుంటారు. ఇలాంటి ప్రామిస్ లు చేసే సమయంలో భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను సైతం తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు.

Shocking Antha Istam Endayya Song Removed From Bheemla Nayak?

Shocking Antha Istam Endayya Song Removed From Bheemla Nayak? || Oktelugu Entertainment