Dhruv Vikram: తండ్రీ కొడుకుల పోటీ పడ్డా.. హిట్ కొట్టలేకపోయారు !

Dhruv Vikram: చాలాకాలంగా విక్రమ్‌ కి సరైన సినిమా పడలేదని అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలో మహాన్‌ గా డబుల్‌ బొనాంజా ఇచ్చాడు విక్రమ్‌. కొడుకు ధృవ్‌ విక్రమ్‌తో కలిసి వైవిధ్యమైన నటనను మరోసారి చూపించాడు. ధృవ్‌ కూడా తండ్రికి ఏమాత్రం తగ్గకుండా పోటాపోటీగా నటించాడని అభిమానులు అంటున్నారు. కార్తిక్‌ సుబ్బరాజ్‌ కూడా తన మార్కు చూపించగా, నిడివి కాస్త ఎక్కువుండడం మైనస్‌ అంటున్నారు. అలాగే సినిమాలో స్క్రీన్ ప్లే కూడా అంత గొప్పగా ఏమి లేదు. […]

Written By: Shiva, Updated On : February 12, 2022 4:04 pm
Follow us on

Dhruv Vikram: చాలాకాలంగా విక్రమ్‌ కి సరైన సినిమా పడలేదని అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలో మహాన్‌ గా డబుల్‌ బొనాంజా ఇచ్చాడు విక్రమ్‌. కొడుకు ధృవ్‌ విక్రమ్‌తో కలిసి వైవిధ్యమైన నటనను మరోసారి చూపించాడు. ధృవ్‌ కూడా తండ్రికి ఏమాత్రం తగ్గకుండా పోటాపోటీగా నటించాడని అభిమానులు అంటున్నారు. కార్తిక్‌ సుబ్బరాజ్‌ కూడా తన మార్కు చూపించగా, నిడివి కాస్త ఎక్కువుండడం మైనస్‌ అంటున్నారు. అలాగే సినిమాలో స్క్రీన్ ప్లే కూడా అంత గొప్పగా ఏమి లేదు.

Dhruv Vikram

వాస్తవానికి విక్రమ్ లో ఎందుకో గత నటుడు కనబడలేదు. తన పాత్రకు తగ్గట్టు విక్రమ్ నటించినా ఎందుకో కొడుకును ఎలివేట్ చేయడానికి తాను తగ్గాడని అనిపిస్తుంది. అసలు తమిళ స్టార్ హీరో విక్రమ్ అంటే విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. గతంలో విక్రమ్ సినిమా వస్తోంది అంటే.. సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉండేది. పైగా ఓపెనింగ్స్ కూడా భారీగా వచ్చేవి. అయితే, ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది. విక్రమ్ సినిమాకు ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో రావడం లేదు.

Dhruv Vikram

ఒకప్పుడు విక్రమ్ కి అభిమానులు పీక్స్ లో ఉండేవారు. వాళ్లంతా ఇప్పుడు ఏమి అయిపోయారు ? స్టార్ హీరోలకే పోటీ ఇచ్చిన విక్రమ్.. ప్రస్తుతం అందుకు పూర్తి భిన్నంగా ఉంది విక్రమ్ పరిస్థితి. విక్రమ్ హీరోగా నటించిన ఈ ‘మహాన్’ సినిమా కోసం అభిమానులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కోసం యాక్షన్ లవర్స్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అసలు ఓటీటీలోనే ఇంట్రెస్ట్ చూపించకపోతే..

Also Read: టుడే ట్రెండ్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ !

ఇక థియేటర్ ల్లో రిలీజ్ చేసి ఉంటే.. ఈ సినిమాని ఎవరూ పట్టించుకునే వారు కూడా కాదు. కాగా కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్లో నేరుగా రిలీజ్ అయింది. మద్యం సిండికేట్ నేపథ్య కథతో ఈ సినిమా తీశారు. ఇక ఈ సినిమాను బట్టి.. విక్రమ్ పాలోయింగ్ విషయంలో కూడా చాలా మార్పులు వచ్చాయని స్పష్టం అవుతుంది.

ఏది ఏమైనా గట్టిగా పదేళ్ల పాటు విక్రమ్ తన హవాని చూపించాడు. కానీ, ప్రస్తుతం విక్రమ్ పని అయిపోయింది అంటున్నారు, ‘ఐ మనోహరుడు’ సినిమాల తర్వాత విక్రమ్ కి ఉన్న మార్కెట్ కూడా పూర్తిగా పడిపోయింది. దానికి తగ్గట్టుగానే ఈ మధ్య విక్రమ్ నుంచి వచ్చిన ఏ సినిమా ఆడలేదు. అందుకే డైరెక్ట్ గా థియేటర్లల్లో రిలీజ్ చేస్తే నష్టాలు వస్తాయని తెలిసి.. అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేశారు.

Also Read: ప్రభాస్ ‘సలార్’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

Tags