Actor Gummadi: అప్పటి ముచ్చట్లు : ఆ మాటలు విని గుమ్మడి గారు ఆశ్చర్యపోయారు !

Actor Gummadi: తెలుగు తెర పై తన మాటలతో గారడీ చేశారు జగ్గయ్య గారు. అందుకే.. ఆ రోజుల్లో డబ్బింగ్ అంటే ముందుగా జగయ్యగారే గుర్తుకు వచ్చేవారు. కానీ, “ఇద్దరు” సినిమా రిలీజ్ అయిన రోజులు అవి. ప్రకాష్‌ రాజ్‌ అద్భుతంగా నటిస్తున్నాడు. కానీ, ప్రకాష్ రాజ్ డైలాగ్స్ విన్నప్పుడు ఇంత గొప్పగా తెలుగును పలుకుతున్నాడు, డబ్బింగ్ చెప్పింది ఎవరై ఉంటారు ? అంటూ గుమ్మడిగారికి డౌట్ అనుమానం కలిగింది. సహజంగా గుమ్మడిగారికి జగ్గయ్య గారి డబ్బింగ్ […]

Written By: Shiva, Updated On : February 12, 2022 4:08 pm
Follow us on

Actor Gummadi: తెలుగు తెర పై తన మాటలతో గారడీ చేశారు జగ్గయ్య గారు. అందుకే.. ఆ రోజుల్లో డబ్బింగ్ అంటే ముందుగా జగయ్యగారే గుర్తుకు వచ్చేవారు. కానీ, “ఇద్దరు” సినిమా రిలీజ్ అయిన రోజులు అవి. ప్రకాష్‌ రాజ్‌ అద్భుతంగా నటిస్తున్నాడు. కానీ, ప్రకాష్ రాజ్ డైలాగ్స్ విన్నప్పుడు ఇంత గొప్పగా తెలుగును పలుకుతున్నాడు, డబ్బింగ్ చెప్పింది ఎవరై ఉంటారు ? అంటూ గుమ్మడిగారికి డౌట్ అనుమానం కలిగింది. సహజంగా గుమ్మడిగారికి జగ్గయ్య గారి డబ్బింగ్ తప్ప మరొకరి వాయిస్ నచ్చదు. అలాంటిది ప్రకాష్ రాజ్ పాత్ర తెలుగు పలుకుతున్న విధానం గుమ్మడి గారిని కట్టి పడేసింది.

Actor Gummadi

సుదీర్ఘ కవితలను, డైలాగులను అలవోకగా చాలా స్పష్టంగా పలుకుతున్నారు. గుమ్మడి గారు, తన పక్కన కూర్చున్న మురళీమోహన్ తో ‘ఏమయ్యా మురళీ.. ఆ కుర్రాడికి డబ్బింగ్ చెప్పింది ఎవరయ్యా ? ఎవరో గానీ, మా జగ్గయ్య కన్నా చాలా బాగా చెబుతున్నాడే.. ఎవరు ?’ అని ఆతృతగా అడిగారు. మురళీమోహన్ చిన్న చిరు నవ్వు నవ్వి.. ‘ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పింది మరెవరో కాదు. రైటర్ అండ్ డైరెక్టర్ జంధ్యాలగారు’ అన్నాడు. గుమ్మడి గారు వెంటనే.. ఓరి.. జంధ్యాల చెప్పాడా ? గొప్పగా చెప్పాడే !’ అని ఆశ్చర్యపోయారు గుమ్మడి గారు.

Jandhyala

సినిమా అయిపోయాక వెంటనే గుమ్మడి గారు.. జంధ్యాలగారి ఇంటికి వెళ్లి.. ‘ఏమయ్యా ఇంత అద్భుతంగా డైలాగ్ లు చెబుతున్నావ్.. నువ్వు మరిన్నీ చిత్రాలకు చెప్పాలి’ అని అంటే.. ఆ మాటకు జంధ్యాల నవ్వుతూ.. ‘అంటే.. ఇప్పుడు నన్ను డైరెక్షన్, రైటింగ్ మానేసి.. డబ్బింగ్ చెప్పుకొని బతకమంటారా ? అంటూ నవ్వేశారు అట. గుమ్మడి గారు కూడా పెద్దగా నవ్వేసి.. ఆ తర్వాత చాలా రోజులు పాటు ఈ మాటనే తల్చుకుంటూ నవ్వుకున్నారు. అయితే విశేషం ఏమిటంటే.. ఆ తర్వాత జంధ్యాల గారు చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు.

Jaggayya

ఆ సినిమాలు ఏమిటో చెబితే “భారతీయుడు” సినిమాలో పోలీసాఫీసర్ నెడుముడి వేణు పాత్రకు కూడా డబ్బింగ్ చెప్పారు. “అరుణాచలం” సినిమాలో రంభ తండ్రి, పెద్ద రజనీకాంత్ (సింహాచలం) మేనేజరుగా విసు పోషించిన పాత్ర గుర్తుందా? ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పిందీ జంధ్యాలే. “భామనే సత్యభామనే” సినిమాలో మీనా తండ్రి పాత్ర, రుక్మిణిని ప్రేమించే ముసలాయన పాత్ర గుర్తుందా? జెమినీ గణేషన్ పోషించాడు ఆ పాత్ర. దానికి డబ్బింగ్ చెప్పింది కూడా జంధ్యాల గారే.

Also Read: ఎట్టకేలకు వారిద్దరి కాంబినేషన్ ఖాయం అయ్యింది !

ఇక “చూపులు కలసిన శుభవేళ” సినిమాలో సుత్తి వీరభద్రరావు పోషించిన గుండు పాండురంగారావు పాత్ర తెలుసు కదా. ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పింది కూడా జంధ్యాలగారే. దురదృష్టవశాత్తూ సుత్తి వీరభద్రరావు హఠాత్తుగా మరణించడంతో ఆ పాత్రకు డబ్బింగ్ జంధ్యాల గారే చెప్పారు. గొప్పదనం ఏమిటంటే ఈ విషయం మనం సినిమా గురించి తెలుసుకున్నప్పుడు తెలుస్తుందే తప్ప చూస్తున్నప్పుడు తెలియదు.

అసలు ఎస్టాబ్లిష్డ్ కమేడియన్, పైగా గొప్ప నటుడు అయిన ఒక వ్యక్తికి ఫుల్ లెంగ్త్ పాత్ర ఉన్నప్పుడు, అంత అతికినట్టు సరిపోయేలా వేరొకరు డబ్బింగ్ చెప్పడం అంటే.. బహుశా ఒక్క జంధ్యాలకి తప్ప మరొకరికి సాధ్యం కాదు. జంధ్యాల తన మాటలనే కాదు.. చాలా సహజంగా కూడా డబ్బింగ్ చెబుతారు. జంధ్యాలగారి గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

Also Read: వైరల్ అవుతున్న టుడే క్రేజీ అప్ డేట్స్ !

Tags