Wife: దారిద్య్రం అనుభవించే వాళ్లు ఇంకా ఉన్నారనడంలో ఏ మాత్రం సందేహాం లేదు. పరిస్థితుల ప్రభావం మరేతర కారణమైనా చాలా మంది కటిక దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారు. కాలం మారుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ పరిస్థితులు లేకపోలేదు. అరకొర జీతాలతో కుటుంబాన్ని పోషించే వారు ఏదైనా కారణం చేత ఉద్యోగాన్ని కోల్పోయినా.. పని దొరకకపోయినా దాన్ని దారిద్య్ర స్థితి అనే చెప్పుకోవచ్చు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్న అనుకుంటున్నారా?..
సాధారణంగా బంగారం మంచిదో కాదో తెలుసుకోవాలనుకుంటే నిప్పుల్లో వేయాలని పెద్దలు చెబుతుంటారు. ఈ తరహాలోనే భార్య స్వభావం తెలుసుకోవాలనుకుంటే మాత్రం దరిద్ర స్థితిలో ఉన్నప్పుడు గమనిస్తే తెలుస్తుందంట. అదేంటి? దారిద్య్రం ఉన్న సమయంలో భార్య ప్రవర్తనను బట్టి ఆమె గురించి చెప్పొచ్చని పెద్దలు చెబుతున్నారు.
భార్యాభర్తల మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఐశ్వర్యం ఉన్నప్పుడు ప్రతి భార్య తమ భర్తతో చాలా ప్రేమగా, సపోర్ట్ గా ఉంటుంది. కానీ ఐశ్వర్యం కోల్పోయి దరిద్ర స్థితికి చేరుకున్న సమయంలో భర్తకు భార్య తోడుగా ఉంటే అంతకంటే అదృష్టవంతుడు ఎవరు ఉండరట. డబ్బు ఉన్న సమయంలో ఒక విధంగా లేని సమయంలో ఒక విధంగా ఉంటే అంతకంటే దౌర్భగ్య స్థితి మరొకటి ఉండదట.
పేదరికం భర్తను చుట్టుముట్టిన ఏ మాత్రం గౌరవం తగ్గించకుండా భార్య సపోర్ట్ గా ఉంటే ఆమెను లక్ష్మీదేవి స్వరూపంగా భావించవచ్చట. అలాగే భర్తకు నేనున్నానంటూ భరోసా ఇవ్వడంతో పాటు కలిసే సమస్యలను ఎదుర్కొందామని చెప్పగలగాలట. ఇదే పరిస్థితిలో భార్య ఉంటే భర్త ఏదో ఒకటి చేసుకుందామని చెప్పి సపోర్ట్ గా నిలబడితే.. ఆ భార్య ఎంతో సంతోషానికి గురవుతుందంట. అందుకే పెద్దలు అంటుంటారు.. పేదరికంలో ఉన్న సమయంలో భార్యను గమనించాలని.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కష్టాసుఖాల్లో భార్యాభర్తలు కలిసి నడవాలని చెబుతుంటారు.