Coolie movie: కూలీ సినిమాలో దళపతి సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నారా..?

ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలు మంచి విజయాలను సాధించాయి. కానీ రీసెంట్ గా విజయ్ తో ఆయన చేసిన 'లియో' సినిమా మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.

Written By: Neelambaram, Updated On : May 20, 2024 2:54 pm

Dalapathi Movie song remixing in Coolie movie

Follow us on

Coolie movie: రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న కూలీ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా రజినీకాంత్ ని చాలా స్టైలిష్ గా చూపించాడు. ఇక ఈ సినిమా మొత్తం మాఫీయా చుట్టూ తిరగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి లోకేష్ కనకరాజ్ తన సత్తాను చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే ఆయన చేసిన ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలు మంచి విజయాలను సాధించాయి. కానీ రీసెంట్ గా విజయ్ తో ఆయన చేసిన ‘లియో’ సినిమా మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఇక దాంతో ఎలాగైనా సరే రజనీకాంత్ చేయబోయే సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ సినిమా మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక రజినీకాంత్ కూడా ఈ సినిమాతో ఇండస్ట్రీలోనే భారీ హిట్ ను సొంతం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని రజనీకాంత్ ప్రయత్నిస్తుంటే, లోకేష్ కనక రాజ్ మాత్రం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే తను టాప్ డైరెక్టర్ గా ఉండాలనే క్రమంలోనే ఈ సినిమాని అత్యంత భారీ హిట్టు గా మలిచే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ సూపర్ హిట్ మూవీ అయిన ‘దళపతి ‘ లోని సింగరాల పైరుల్లోనా అనే సాంగ్ ని రీమిక్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక అది కూడా మొత్తం సాంగ్ కాకుండా ఓన్లీ పల్లవి వరకు మాత్రమే చిన్న బిట్ సాంగ్ ను రీమిక్స్ చేసి వాడుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఆ పాట సినిమాలో ఎక్కడ వస్తుంది. ఎలాంటి సిచువేషన్ లో వస్తుంది అనే దానికి సరైన క్లారిటీ లేనప్పటికీ సినిమా యూనిట్ నుంచి మాత్రం సాంగ్ రీమిక్స్ చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి…