
Tea Health Problems: ప్రతి రోజు చాలా మందికి టీ తాగనిదే దిన చర్య ప్రారంభం కాదు. కొందరు బెడ్ మీద నుంచి దిగే ముందే బెడ్ కాఫీ లాగించేస్తారు. కానీ ఫేస్ వాష్ చేసుకున్న తరువాతే టీ తాగడం వల్ల మనసుకు హాయినిస్తుంది. టీ తాగడం వల్ల అందులో ఉండే కెఫిన్ మనిషికి ఉత్తేజాన్ని ఇస్తుంది. టీ ఆకుల్లో ఉండే ఆర్గానికి కాంపౌండ్లు ఐరన్ ను ఇస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సాటి మనిషితో కాలక్షేపం చేయడానికి, సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి టీ ని కొందరు పలుమార్లు తాగాల్సి వస్తుంది. అయితే మోతాదుకు మించి టీ తాగడం వల్ల హానికరమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా రోజుకు ఒకసారి తాగితే మంచిదని, రెండోసారి హాని అని అంటున్నారు. ఇక సాయంత్రం టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. వాటి గురించి మీకోసం..
టీ తాగడం వల్ల మనిషిలో ఉత్తేజాన్ని ఇస్తుంది. పాడైన జీవకణాలను నిద్ర లేపుతుంది. కానీ కొందరు ఆహారం కంటే ఎక్కువగా టీ ని తీసుకుంటారు. ఉదయం, సాయంత్రం కచ్చితంగా టీ తాగే అలవాటు చాలా మందిలోఉంటుంది. రోజ ఒకసారి టీ తాగడం వల్ల ఆరోగ్యమే. కానీ రెండో సారి చేటును కలిగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం చాలా మంది టీ తాగిన తరువాతే పనిని మొదలుపెడుతారు. ఇలా చేయడం వల్ల నష్టాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సాయంత్రం టీ అవైడ్ చేయడమే మంచిదని అంటున్నారు.
– ఇప్పుడున్న వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు రకరకాల వ్యసనాలకు బానిసలవుతున్నారు. నిత్యం ఒత్తిడికి గురయ్యేవారు ఇపశమనం కోసం వెంటనే టీ ని తీసుకుంటారు. ఇలాంటి వారికి సాయంత్రం టీ తాగనిదే పని ముందుకు కదలదు. దీంతో ఇది వ్యసనంగా మారుతుంది. ఒక్కోసారి టీ తాగకపోతే వారి మానసిక అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.

-పొడి చర్మం, జుట్టు సమస్యలు ఉన్నవారు కూడా టీ కి దూరంగా ఉండడమే బెటర్. శరీరంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల చర్మం పొడిబారుతుంది. ఇలాంటి వారు రెండోసారి టీ ని తాగడం వల్ల బాడీలో వేడి పెరుగుతంది. ఫలితంగా శరీరం డీ హైడ్రేషన్ కు గురయ్యే శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. మిగతా వేడి వస్తువుల కంటే టీ తాగడం వల్ల ఎక్కువగా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. సాయంత్రం ఈ ప్రక్రియ మరింత ఇబ్బంది పెడుతుంది. అందువల్ల సాయంకాలం టీ మానుకుంటే మంచింది.
-మలబద్దకం, ఎసిడిటీ తో బాధపడేవారికి సాయంకాలం టీ శత్రువుగా మారుతుంది. వీరు దినచర్యలో భాగంగా ఏవేవో ఆహారాన్ని తీసుకుంటారు. అవి జీర్ణమయ్యేసరికే సమయం పడుతుంది. ఈ సమయంలో వీరు సాయంకాలం టీ ని తీసుకోవడం వల్ల ఆహారాన్ని త్వరగా జీర్ణం అవనివ్వదు. దీంతో మలబద్దకం సమస్య ఏర్పడుతుంది. క్రమంగా ఏసిడీటీ ఏర్పడి కడుపులో మంట లాంటి సమస్యలు ప్రారంభమవుతాయి.
-చాలా మంది రాత్రి విధుల్లో మునిగిన వారు నిద్రను పోగొట్టేందుకు టీ తీసుకుంటారు. అయితే అంతకుముందే సాయంకాలం వీరికి టీ తాగనితే పని ప్రారంభం కాదు. టీ పవర్ తగ్గిన తరువాత మళ్లీ నిద్ర వచ్చే సమయంలో టీ ని తీసుకుంటే నిద్ర పాడవుతుంది. ఇది రాను రాను నిద్రలేమి సమస్యకు దారి తీస్తుంది.