https://oktelugu.com/

Singer Sunitha: సింగర్ సునీత భర్త కి గుర్తు తెలియని వ్యక్తి నుండి బెదిరింపులు..రంగంలోకి దిగిన పోలీసులు

Singer Sunitha: సోషల్ మీడియా లో తరచూ వార్తల్లో ఉండే జంటలలో ఒకటి సింగర్ సునీత మరియు రామ్ జంట.వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నప్పటి నుండి వీళ్ళకి సంబంధించి ఏ వార్త బయటకి వచ్చినా అది సోషల్ మీడియా లో వైరల్ అయిపోతుంది. వీళ్లిద్దఇరికి సంబంధించిన విశేషాలను తెలుసుకునేందుకు కూడా నెటిజెన్స్ అమితాసక్తిని చూపిస్తూ ఉంటారు. రీసెంట్ గా సునీత భర్త రామ్ కి KK లక్ష్మణ్ అనే గుర్తు తెలియని వ్యక్తి నుండి బెదిరింపులు వస్తున్నాయి. ముందుగా […]

Written By:
  • Vicky
  • , Updated On : April 24, 2023 / 03:54 PM IST
    Follow us on

    Singer Sunitha

    Singer Sunitha: సోషల్ మీడియా లో తరచూ వార్తల్లో ఉండే జంటలలో ఒకటి సింగర్ సునీత మరియు రామ్ జంట.వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నప్పటి నుండి వీళ్ళకి సంబంధించి ఏ వార్త బయటకి వచ్చినా అది సోషల్ మీడియా లో వైరల్ అయిపోతుంది. వీళ్లిద్దఇరికి సంబంధించిన విశేషాలను తెలుసుకునేందుకు కూడా నెటిజెన్స్ అమితాసక్తిని చూపిస్తూ ఉంటారు. రీసెంట్ గా సునీత భర్త రామ్ కి KK లక్ష్మణ్ అనే గుర్తు తెలియని వ్యక్తి నుండి బెదిరింపులు వస్తున్నాయి.

    ముందుగా రామ్ ఫోన్ నెంబర్ సంపాదించి అతనిని మెసేజి మరియు మిస్సెడ్ కాల్స్ చేసి కలవాలి అనేవాడు.అపరిచిత వ్యక్తి కావడం తో రామ్ అతనిని కలవడానికి నిరాకరించాడు. ఏదైనా వ్యాపారానికి సంబంధించిన విషయం అయితే తన టీం ని కలవాల్సిందిగా చెప్పుకొచ్చాడు. అయినా ఆ లక్ష్మణ్ అనే వ్యక్తి గ్యాప్ ఇవ్వకుండా కాల్స్ మరియు మెసేజిలు చేస్తుండే లోపు అతని నెంబర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేసాడు.

    అయినా ఆ లక్ష్మణ్ అనే వ్యక్తి తగ్గలేదు. వేరే నెంబర్ నుండి కాల్స్ మరియు మెసేజి చేసి రామ్ ని చంపేస్తాను అంటూ బెదిరింపులు చెయ్యడంతో, రామ్ సమీపం లో ఉన్న బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో లక్ష్మణ్ అనే వ్యక్తి పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. రామ్ మ్యాంగో మ్యూజిక్ సంస్థ కి అధినేత అనే విషయం అందరికీ తెలిసిందే.

    Singer Sunitha

    దీనితో పాటు ఈయనకి ఎన్నో వ్యాపారాలు మరియు రియల్ ఎస్టేట్ బిజినెస్ లు ఉన్నాయి.ఇతని ఆస్తుల వివరాలు మరియు బ్యాంక్ బ్యాలన్స్ వంటివి అన్నీ చూస్తే హైదరాబాద్ లోనే అత్యంత ధనవంతుల జాబితాలో కచ్చితంగా ఉంటాడు. అందుకే ఈయన విషయాలన్నీ తెలుసుకొని లక్ష్మణ్ అనే వ్యక్తి ఇలాంటి బెదిరింపులకు పాలుపడుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.