
Taati Munjalu: వేసవి కాలంలో మనకు విరివిగా లభించే పండ్లలో తాటిముంజలు ఉంటాయి. చల్లగా తింటుంటే ఎంతో హాయిగా అనిపించే తాటిముంజలను వేసవిలో వదలకుండా తింటే ఎంతో లాభం. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ తాటిముంజలు దొరుకుతాయి. దీంతో ఎండాకాలంలో ముంజలను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. ఎండాకాలం ప్రారంభంలోనే ముంజలు దర్శనమిస్తుంటాయి.
వీటిని కన్నడలో తాటి మంగు అంటారు. తమిళంలో మంగు అని పిలుస్తారు. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. శరీరానికి కావాల్సిన ఎనర్జీ ఉంటుంది. వేసవిలో చలువ కోసం తాటి ముంజల్ని తినడం మంచిది. వేసవి కాలంలో ముఖంపై చెమటకాయలు వస్తుంటాయి. వాటి నుంచి ఉపశమనం పొందాలంటే ముంజల్ని తినాల్సిందే. దీంతో అవి దూరమవుతాయి.
వేసవి కాలంలో దాహం అధికంగా వేస్తుంది. వేసవిలో శరీరానికి కావాల్సిన మినరల్స్, చక్కెరలను సమతుల్యం చేస్తాయి. ఇందులో విటమిన్ బి, ఐరన్, కాల్షియం ఉండటం వల్ల వీటిని తినడం లాభమే. గర్భిణులకు ఏం తిన్నా త్వరగా జీర్ణం కాదు. ఇలాంటి సమయంలో ముంజలు తింటే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం, ఎసిడిటి వంటి అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.

కాలేయ సంబంధిత రోగాలను తగ్గించుకోవచ్చు. ముంజలు తినడం వల్ల చెడు కొవ్వు తొలగిపోయి మంచి కొవ్వు పెరుగుతుంది. తాటి ముంజల్ని గుజ్జుగా చేసుకుని ముఖానికి మాస్క్ లా వేసుకుంటే చర్మం మెరుస్తుంది. ఎండాకాలంలో వచ్చే చెమటకాయలను రాకుండా చేస్తుంది. క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తుంది. శరీరానికి కావాల్సిన మినరల్స్, న్యూట్రిషియన్లు శాతాన్ని పెంచుతాయి.