Success Tips: జీవితంలో మంచి పొజిషన్లో ఉండాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందుకోసం నేటి కాలంలో తల్లిదండ్రులు చాలా కష్టపడి తమ పిల్లల ను లక్షల కోసి చదివిస్తున్నారు. అయితే అన్ని సౌకర్యాలు ఉన్న ప్రైవేట్ స్కూల్లో చదివిన విద్యార్థులు ఆ తర్వాత ఉద్యోగం చేయడం అటు నుంచి దుబార ఖర్చులు చేస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇంకొందరు తమకు ఎన్నో కష్టాలు ఉన్నాయని.. తమకు డబ్బు లేదని.. అందువల్ల జీవితంలో ఎదగడం కష్టమని అనుకుంటూ ఉంటారు. అయితే వీరందరికీ ఓ యువకుడు ఆదర్శంగా నిలిచారు. చిన్నప్పటి నుంచి ఎలాంటి డబ్బు లేకపోయినా.. కనీసం చదువుకోవడానికి అవకాశం లేకపోయినా.. పట్టుదల, కృషితో ముందుకు వెళ్లి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాడు. ఆ తర్వాత పదోన్నతులు పొందాడు. అయితే వారి సామాజిక వర్గంలో ఇప్పటివరకు ఒక్క వ్యక్తి కూడా ఈ పొజిషన్లకు రాలేదు. అయితే ఇప్పుడు తనకు ఎంతో గర్వంగా ఉందని అంటున్నాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? అతని సక్సెస్ కు కారణాలేంటి?
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు చెందిన మధనం గంగాధర్ 1982లో చిన్న వయసులోనే ఎస్సై ఉద్యోగాన్ని పొందాడు. ఆ తర్వాత పదోన్నతులు పొంది డీఎస్పీగా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన స్వాతంత్ర వేడుకల్లో ఆయన ముఖ్యమంత్రి సర్వోన్నత పథకం అవార్డును పొందారు. ఇలా మొత్తం 200 వరకు అవార్డులను సాధించారు. గంగాధర్ తన జీవితాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా.. సమాజంలో ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఇంతటి పేరు, హోదా రావడానికి ఆయన ఎన్నో రకాలుగా కష్టాలు పడ్డారు.
బుడగ జంగాల వారు నిత్యం సంచార జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలాంటి వారి కుటుంబంలో గంగాధర్ జన్మించారు. చిన్నప్పటి నుంచి పేపర్ వేస్తూ.. కూల్ డ్రింక్స్ అమ్ముతూ.. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేవారు. ఆ తర్వాత ప్రభుత్వ స్కూల్లో చదివి.. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించాడు. చివరికి ఎస్ఐగా ఉద్యోగం సాధించి గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా గంగాధర్ నేటి యువతకు కొన్ని సూచనలు అందించారు.
Also Read: క్రెడిట్ స్కోర్ లేకపోతే పిల్లను ఇవ్వరా? పెళ్లి కాదా?
ప్రస్తుత కాలంలో చాలామంది యువత తమకు అన్ని సౌకర్యాలు ఉన్నా.. సమయాన్ని వృధా చేస్తున్నారని ఆయన అంటున్నారు. ప్రతి ఒక్కరికి చదివే జీవితాన్ని నిలబెడుతుందని.. బాగా చదువుకోవడం వల్ల జీవితం కూడా చక్కగా మారుతుందని అంటున్నారు. ముఖ్యంగా పేదవారి కుటుంబంలో ఉన్నవారు చదివే జీవితముగా ముందుకు సాగాలని అంటున్నారు. కొందరు చిన్న చిన్న కష్టాలు ఎదురవగానే చదువు మానేయడం చేస్తారు. అలా మధ్యలో చదువు మానేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అంటున్నారు.
చదువుకున్న వారికి ఈ ప్రపంచంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అయితే వాటిని వెతుక్కోవడానికి ప్రయత్నించాలి. కొందరు తాము ఉన్నత చదువు చదివినా.. సరైన ఉద్యోగం లేదని బాధపడుతూ ఉంటారు. కానీ అనుకున్న ఉద్యోగం పొందడానికి నిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. అంతేకాకుండా చిన్నచిన్న సమస్యలు ఎదురుగా గాని వెనుకడుగు వేస్తారు. అలా వెనుకడుగు వేయకుండా చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇక కొందరు నీటి కాలంలో బాగా చదువుకొని ఏ పని చేయలేక ఆ*త్మహత్యలు చేసుకుంటున్నారని.. అలా చేయడంవల్ల ఎవరికి ఉపయోగం అని అంటున్నారు. బతికి ఉండి ఏదో ఒకటి సాధించాలని.. పేదరికంతో చనిపోతే అర్థం ఏమి ఉండదని అంటున్నారు.