Credit Score Marriage: ఒకప్పుడు ఒక పెళ్లి కావాలంటే అబ్బాయి వెనుక ఆస్తులు ఎంత ఉన్నాయి? అబ్బాయి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? అని ఎంక్వయిరీ చేసేవారు. ఆ తర్వాత అబ్బాయి ఏ జాబ్ చేస్తున్నాడు? నెలకు ఎంత సంపాదిస్తున్నాడు? ఇప్పటివరకు ఎంత పొదుపు చేశాడు? అనే విషయాలను తెలుసుకునేవారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. అబ్బాయి క్యారెక్టర్ గురించి తీవ్రంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా అతని క్యారెక్టర్ కంటే మనీ మెయింటెనెన్స్ ఎలా ఉంది? అనే విషయాలు తెలుసుకోగలుగుతున్నారు. ఇందులో భాగంగా అతని క్రెడిట్ స్కోర్ ఎలా ఉంది అని చెక్ చేస్తున్నారు? అసలు పెళ్లికి.. క్రెడిట్ స్కోర్ కు సంబంధం ఏంటి? అసలు క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే పిల్లలు ఇవ్వరా? వారికి పెళ్లిళ్లు కావా?
Also Read: గంటల తరబడి రీల్స్ చూస్తున్నారా?
భవిష్యత్తులో పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉందని కొందరు ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి క్యారెక్టర్ తో పాటు అతని ఆర్థిక వ్యవహారాలు ఎలా ఉన్నాయి అనేది కూడా ప్రధానం కానున్నాయి. ప్రస్తుత కాలంలో చాలామంది డబ్బు సంపాదిస్తున్నారు. కానీ ఆ డబ్బులు ఎలా పొదుపు చేయాలి? ఎలా ఖర్చు పెట్టాలి? అనే విషయాలపై అవగాహన ఉండడం లేదు. దీంతో కొంతమంది ఉద్యోగం రాగానే ఎడాపెడా ఖర్చు చేస్తున్నారు. అవసరంలేని వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు బ్యాంకు రుణాలు తీసుకుంటున్నారు. అయితే అనుకోకుండా ఉద్యోగం పోయినా.. అప్పులు ఎక్కువగా అయినా.. ఆర్థిక పరిస్థితి ఆందోళనగానంగా మారుతుంది. ఇదే సమయంలో నెల చెల్లించే ఈఎంఐ లో పెండింగ్లో పడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది.
అయితే రానున్న కాలంలో ఇలా ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడమే కాకుండా అతడి క్రెడిట్ స్కోర్ గురించి కూడా పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే బ్యాంకు వ్యవహారాల్లో అన్ని సక్రమంగా ఉంటేనే క్రెడి స్కోర్ బాగా ఉంటుంది. బ్యాంకు రుణం తీసుకొని ఈఎంఐ కట్టకపోయినా.. బ్యాంకులో నిత్యం బ్యాలెన్సు లేకపోయినా.. క్రెడిట్ కార్డులు వాడుతూ సరైన తేదీకి బిల్లు చెల్లించకపోయినా.. క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. ఇలా క్రెడిట్ స్కోర్ తగ్గిన వ్యక్తికి పిల్లలు ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆర్థిక వ్యవహారాలు ఇలా ఉంటే భవిష్యత్తులో తమ కూతురు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుందని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా పెళ్లికి ముందే ఇలాంటి పరిస్థితి ఉంటే.. పెళ్లయిన తర్వాత మరిన్ని ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో క్రెడిట్ స్కోర్ తగ్గి.. బ్యాంకు నుంచి కొత్త రుణం పొందడం కానీ.. ఇతర ఆర్థిక వ్యవహారాలు జరపడం కానీ జరగదు. ఈ పరిస్థితుల్లో తన లైఫ్ ఎలాగూ బాగుండదని ఆడపిల్లల తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు.
Also Read: లేడీస్ హాస్టల్సే టార్గెట్.. ఏకంగా 150 కోట్ల టర్నోవర్!
అందువల్ల అబ్బాయిలు తమ క్యారెక్టర్ మాత్రమే కాకుండా తమ క్రెడిట్ స్కోర్ ని కూడా ఎప్పుడు బాగా ఉండేలా ప్రయత్నించాలి. లేకపోతే పెళ్లిలో అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని కొందరు హెచ్చరిస్తున్నారు.