Alcohol Control Machine: మందేస్తే చిందేయొచ్చు.. మందేస్తే మజా ఉంటుంది.. మందు లేకపోతే మనసు మనుసులా ఉండదు.. అని కొందరి భావన. అందువల్ల ప్రతి ఫంక్షన్లో.. ప్రత్యేక కార్యక్రమంలో.. మందు లేకుండా ఉండలేరు. ఇక వీకెండ్ రోజుల్లో మాత్రం ఖచ్చితంగా కిక్ ఉండాల్సిందే. అయితే కాలం మారుతున్న కొద్ది టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే వ్యవసాయంలో సైతం సాంకేతికం ఎంట్రీ ఇచ్చేసింది. మరి మందు విషయంలో కూడా టెక్నాలజీ ఉంటే ఎంత బాగుండో కదా.. అయితే ఇలా ఆలోచిస్తున్న వారికి విదేశీయులు ఒక కొత్త రకమైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ మందు కు సంబంధించిన టెక్నాలజీ ఏంటి? అదెలా పనిచేస్తుంది?
Also Read: మీ ఆరోగ్యానికి 24/7 ఏఐ సహాయకుడు
సాధారణంగా ఒత్తిడి, శారీరక శ్రమను తగ్గించుకోవడానికి ప్రతిరోజు రెండు పెగ్గులు వేయాలని అనుకుంటూ ఉండేవారు ఉన్నారు. మరికొందరు మాత్రం ఫుల్లు బాటిల్ కంప్లీట్ చేయకుండా వదిలిపెట్టరు. అయితే ఇలా ఇష్టం వచ్చినట్లు తాగడం వల్ల ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే అవుతుంది. మందు తాగాలంటే కచ్చితంగా లిమిట్ ఉండాలని కొందరు చెబుతుంటారు. కానీ మొదలుపెట్టేంతవరకే లిమిట్ ఉంటుంది.. ఆ తర్వాత అదుపులో ఉండదు. అయితే ఇలా మందు తాగే వారిని అదుపులో ఉంచడానికి ఒక మెషిన్ వచ్చింది. ఇది ఎలా పనిచేస్తుందంటే?
మందు తాగే ముందు కొందరు నేను ఈరోజు రెండు పెగ్గులు మాత్రమే తాగుతాను.. అని అనుకుంటారు. కానీ ఆ తర్వాత బాటిల్ చూస్తే మనసు ఆగదు అని అంటారు. అయితే ఇలా ప్రతి బాటిల్ కు ఒక మిషన్ ను పెట్టి విక్రయిస్తున్నారు. అంతేకాకుండా కొందరు ఒక మిషన్ ని కొనుక్కొని బాటిల్కు అమర్చుకుంటున్నారు. ఈ మిషన్ ద్వారా ఎంత మంది కావాల్సి వస్తే అంతవరకు మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు ఈరోజు 90 ఎం.ఎల్ తాగాలని నిర్ణయించుకుంటే.. అంతవరకు మాత్రమే వస్తుంది. మిగతాది బాటిల్లోనే ఉండిపోతుంది. ఇలా అవసరమయినంతవరకు మాత్రమే మందు తాగి.. మిగతాది వాయిదా వేసుకోవచ్చు.
Also Read: జీవితాన్ని సంకనాకిస్తున్న ఐదు వ్యసనాలు ఇవే!
అయితే మద్యం ను కంట్రోల్ చేయాలని అనుకునే వారికి ఇది ఉపయోగకరంగా ఉండనుంది. ఎక్కువగా మద్యం తాగే వారు దూరంగా ఉండాలని అనుకుంటే.. ఒక బాటిల్కు ఈ మిషన్ను అమర్చుకోవాలి.. రోజుకు 2ml తగ్గించుకుంటూ రావాలి. ఇలా కొన్ని రోజులపాటు తగ్గిస్తే.. చివరికి పూర్తిగా మందు మానేసి అవకాశం ఉంటుంది. కానీ నిత్యం ఫుల్లు తాగే వారికి మాత్రం ఈ మిషన్ పనిచేయదు అని చెప్పచ్చు. అయితే దీనిని ఇప్పుడు విదేశాల్లో ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఇండియాలోకి వస్తే ఇది పనిచేస్తుందా? దీనిని ఎంతమంది వాడతారు? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇది మందును ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుందో ఈ వీడియో చూసి తెలుసుకోండి..