Tips for Home Loan takers: ఇల్లు కట్టుకోవాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. అయితే ఇల్లు నిర్మించడానికి అవసరమయ్యేటప్పుడు జీవితాంతం సంపాదించాలి. ప్రస్తుత కాలంలో ధరలు విపరీతంగా పెరగడంతో ఇల్లు నిర్మించడం చాలా కష్టంగా మారింది. అయితే ఒకేసారి డబ్బు వచ్చింది కంటే నెల నెల ఈఎంఐ ద్వారా కూడా ఇల్లు నిర్మించుకోవచ్చు. ఈ నేపథ్యంలో బ్యాంకులో రుణాలు ఇస్తుంటాయి. మిగతా రుణాల కంటే గృహ రుణాలపై వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది ఇల్లు నిర్మించుకునేవారు హోమ్ లోన్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఎంతో కష్టపడి హోమ్ లోన్ ను పూర్తి చేస్తారు. కానీ చివరి నిమిషంలో చేసే నిర్లక్ష్యాల వల్ల ఆర్థికపరమైన నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతకీ హోం లోన్ పూర్తయిన తర్వాత ఏం చేయాలి? ఇలాంటి వాటి విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు?
హోమ్ లోన్ పూర్తి అయిన తర్వాత చాలామంది ఇక తమ పని అయిపోయింది అని రిలాక్స్ అవుతారు. కానీ లోన్ పూర్తి అవడం అంటే అన్ని ఈఎంఐలు చెల్లించడమే కాకుండా.. లోన్ కు సంబంధించిన పత్రాలను తిరిగి తీసుకోవాలి. కొన్ని హోమ్ లోన్ లకు ఇంటికి సంబంధించిన పత్రాలను తనఖా పెట్టుకుంటారు. అయితే ఇవి లోన్ పూర్తి అయిన వెంటనే రిలీజ్ చేసుకోవాలి. ఆలస్యం చేస్తే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే లోన్ పూర్తయిన తర్వాత No Objection Certificate (NOC) తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ సర్టిఫికెట్ తీసుకోకపోతే బ్యాంకుకు ఇంకా లోన్ బాకీ ఉన్నట్లే గ్రహిస్తారు. అంతేకాకుండా ఈ సర్టిఫికెట్ తీసుకుంటేనే.. తదుపరి లోన్ కు అర్హులవుతారు. అంతేకాకుండా సిబిల్ స్కోర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల దీనిని తప్పనిసరిగా తీసుకోవాలి.
అలాగే ఆన్లైన్లో బ్యాంకు లోన్ కు సంబంధించిన వివరాలు ఉంటే.. అందులో లోన్ పూర్తయినట్లు మెసేజ్ ఉందా? లేదా? అనేది చెక్ చేసుకోవాలి. కొన్ని బ్యాంకుల్లో లోన్ పూర్తయిన తర్వాత కూడా ఇవి యాక్టివ్ గానే ఉంటాయి. ఇలా రోజుల తరబడి అలాగే చూపిస్తే కొన్ని రోజుల తర్వాత బ్యాంకు అధికారులు నోటీసులు పంపించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆన్లైన్ లేదా యాప్ లో లోన్ క్లోజ్ అయినట్లు చూపించే విధంగా సెట్ చేసుకోవాలి. లోన్ తీసుకున్న తర్వాత.. అన్ని ఈఎంఐ లో సక్రమంగా చెల్లిస్తే.. అవి కరెక్టే ఉన్నాయా? అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి బ్యాంకు అధికారులు అప్డేట్ చేయరు.. అలా చేయకపోతే ఆ భారం వినియోగదారులపైనే పడుతుంది. ఈఎంఐ లలో ఒక్కటి పే చేయకపోయినా సిబిల్ స్కోర్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఫలితంగా ఆఫర్లు, తదుపరి లోన్లు పొందే అవకాశం ఉండదు.
లోన్ పూర్తయిన తర్వాత ఒకసారి బ్యాంకు అధికారులను సంప్రదించడం మంచిది. తమ లోన్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయమని చెప్పాలి. ఇలా కమ్యూనికేషన్ ఉండడం వల్ల ఏ సమస్య ఉన్న వెంటనే పరిష్కరించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.